HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Platic Flexi Ban In Andhra Pradesh From November

AP Bans Plastic Flexi: ఏపీలో ప్లాస్టిక్ నిషేధం, రూ. 100 జరిమానా

నవంబర్ 1 నుంచి ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్‌ జారీ అయింది.

  • By Hashtag U Published Date - 08:48 PM, Thu - 22 September 22
  • daily-hunt
Jagan Flexi
Jagan Flexi

నవంబర్ 1 నుంచి ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్‌ జారీ అయింది.
ప్లాస్టిక్ వస్తువులతో ఉత్పన్నమయ్యే కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా రాష్ట్రంలో ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు. ఇకపై క్లాత్‌తో తయారు చేసిన ఫ్లెక్సీలను మాత్రమే వినియోగించాలని సూచించారు. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. అయితే, ఇవాళ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది . పర్యావరణ పరిరక్షణ చట్టం కింద 2022 నవంబరు 1 తేదీ నుంచి నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తికి, దిగుమతికి ఎవరికీ అనుమతి లేదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనకు కూడా నిషేధం వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.నగర, పట్టణ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ ఇనస్పెక్టర్లు బాధ్యత వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వినియోగించకుండా జిల్లా కలెక్టర్లు, జెడ్పీసీఈవోలు, పంచాయితీ అధికారులు, గ్రామ సచివాలయాలు బాధ్యత వహించాల్సిందిగా సూచనలు జారీ చేసింది.. నిషేధం ఉత్తర్వులు అమలు తర్వాత ప్రతీ ఫ్లెక్సీకి రూ. 100 మేర జరిమానా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై పర్యావరణ పరిరక్షణ చట్టం కింద శిక్ష తప్పదని హెచ్చరించింది. ఫ్లెక్సీల నిషేధిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ అమలు పర్యవేక్షణను రెవెన్యూ, పోలీసు, రవాణా, జీఎస్టీ తదితర అధికారులు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లకు బదులుగా కాటన్, నేత వస్త్రాలను వినియోగించుకోవచ్చని సూచనలు ఇస్తూ నోటిఫికేషన్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది .


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra ban
  • ap govt bans
  • plastic flexi ban

Related News

    Latest News

    • IND Beat PAK: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా!

    • Pakistan: భార‌త్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు అవమానం.. వీడియో వైర‌ల్‌!

    • Health Tips: పాల‌తో ఈ ప‌దార్థాల‌ను క‌లిపి తీసుకుంటే డేంజ‌ర్‌!

    • Ministry Of Finance Employee: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి దుర్మ‌రణం..!

    • Hardik Pandya: పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా స‌రికొత్త రికార్డు!

    Trending News

      • 8th Pay Commission: దీపావళికి ముందే భారీ శుభ‌వార్త‌.. ఏంటంటే?

      • Vahanamitra: వాహనమిత్రకు ఎవరు అర్హులు? ఎవ‌రు అన‌ర్హులు??

      • GST Reform: గుడ్ న్యూస్‌.. ఈ వ‌స్తువుల‌పై భారీగా త‌గ్గిన ధ‌ర‌లు!

      • Policy Premium: పాలసీ ప్రీమియం చెల్లింపులో ఆలస్యం చేయకండి.. ఎందుకంటే?

      • Jersey Sponsorship: టీమిండియా కొత్త‌ జెర్సీ స్పాన్సర్‌పై బిగ్ అప్డేట్‌ ఇచ్చిన బీసీసీఐ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd