Viral : ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’
ఇప్పుడు ఎక్కడ చూసిన పిఠాపురంలో వాహనాలపై స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తోంది. కొంతమంది బైకర్లు తమ వాహనాలపై 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ పవన్ ఫొటో, జనసేన లోగోతో స్టిక్కర్లు వేయించుకుంటున్నారు
- By Sudheer Published Date - 08:26 AM, Tue - 28 May 24

జూన్ 04 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యముగా పవన్ కళ్యాణ్ , జనసేన అభిమానులు. ఎందుకో చెప్పాల్సిన పనిలేదు కానీ చెప్పాల్సిన బాధ్యత మాది. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు సంబదించిన ఫలితాలు జూన్ 04 న వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలపై యావత్ దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ రిజల్ట్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఈసారి ఏపీలో ఎవరు విజయం సాధిస్తారా అని వేలకోట్లలో పందేలు సైతం కాస్తున్నారు..ఆల్రెడీ కోసేశారు కూడా. ఇక పిఠాపురం విషయం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ నుండి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడం తో మరింత క్రేజ్ నెలకొంది. పవన్ గెలుపు ఖాయమని ఇప్పటికే స్పష్టం కావడం తో ఫలితాల కంటే ముందే పవన్ కళ్యాణ్ అభిమానులు , ఆ నియోజకవర్గ ప్రజలు పవన్ తాలూకా అంటూ చెప్పుకోవడం మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పుడు ఎక్కడ చూసిన పిఠాపురంలో వాహనాలపై స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తోంది. కొంతమంది బైకర్లు తమ వాహనాలపై ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ పవన్ ఫొటో, జనసేన లోగోతో స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకరిని చూసి మరొకరు ఈ ట్రెండ్ కొనసాగిస్తున్నారు. కూటమి అభ్యర్థిగా పవన్ ఇక్కడ విజయం సాధించేశారని వారు డిసైడ్ అయ్యారు. అందుకే మా ఎమ్మెల్యేగారు అంటూ హడావిడి చేస్తున్నారు. మీము మాత్రం తక్కువ అన్నట్లు ఇక వంగా గీత అభిమానులు డిప్యూటీ సీఎం అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారని తెలుస్తోంది. జనసైనికులకు పోటీగా వీరు కూడా హడావిడి మొదలు పెట్టారు. మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంటున్నారు. జగన్ సీఎం, వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద మాత్రం పిఠాపురం వ్యాప్తంగా ఈ స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తుంది. మరి జూన్ 04 న ఎవరి స్టిక్టర్ ఆగుతుందో చూడాలి.
Read Also : Traffic Rules : వాహనదారులు ఇక స్పీడ్ తగ్గించుకోవాల్సిందే..లేకపోతే మీ జేబులు ఖాళీనే