PIL in HC: సమ్మెపై హైకోర్టులో సవాల్
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల ఇచ్చిన సమ్మె నోటీస్ ను సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) హైకోర్టు వేశారు.
- By CS Rao Published Date - 01:57 PM, Sat - 29 January 22

ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల ఇచ్చిన సమ్మె నోటీస్ ను సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) హైకోర్టు వేశారు. విశాఖటపట్నం కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ నాదెండ్ల సాంబశివరావు పిల్ దాఖలు పరిచాడు. సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా సమ్మె చేయడానికి ఉద్యోగులు పూనుకున్నారని సవాల్ చేశాడు. రాజ్యాంగబద్ధమేగానీ, సర్వీస్ రూల్స్ కు సమ్మె విరుద్ధమనే అంశాన్ని కోడ్ చేస్తూ పిల్ వేశాడు.టికె రంగరాజన్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు 2003న ఇచ్చిన తీర్పును కోడ్ చూస్తూ పిల్ దాఖలు పరిచాడు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయరాదని, అలాంటి చర్య చట్టవిరుద్ధమని సుప్రీం కోర్డు ఆనాడు స్పష్టం చేసింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ సమ్మెపై సవాల్ చేశాడు. సమ్మె నివారణకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరాడు. ఈ కేసులోచీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆర్థిక), ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ), పీఆర్సీ పోరాట కమిటీ, ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి, ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని ప్రతివాదులుగా చేర్చాడు.30 శాతం పాజిటివ్ రేటుతో రాష్ట్రంలో దాదాపు 15,000 కొత్త కేసులు నమోదు అయిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కోవిడ్ మూడో వేవ్‌లో పిఆర్‌సి పోరాట కమిటీ సమ్మె నోటీసు జారీ చేయడం పూర్తిగా అశాస్త్రీయమని పిల్ లో పేర్కొన్నాడు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేయడం తప్ప మరొకటి లేదని పిటిషనర్ వాదించాడు. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం ప్రజలకు అవసరమైన సేవలను తిరస్కరించడం తప్ప మరొకటి కాదంటూ.. ఇది మరింత ప్రమాదకర చర్యని సమ్మెపై సవాల్ చేశాడు. ఉద్యోగుల సమ్మె ప్రజాజీవనంపైనా, ప్రభుత్వ రోజువారీ పాలనపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రొఫెసర్ రావు తెలిపారు. లక్షలాది మంది ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల పరిపాలనపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ట్రెజరీ ఉద్యోగులు కూడా వేతనాలను అప్‌లోడ్ చేయడం, అప్‌డేట్ చేయడంలో కాలయాపన చేస్తుండడంతో ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ద్వారా ప్రభుత్వం కూడా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించినట్టు కనిపిస్తోందిని నాదెండ్ల సాంబశివరావు వాదించాడు. ఈ పిల్ పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.