Pawan Photos : ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబుతో పాటు పవన్ ఫొటోలు..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ..అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గౌరవం ఏమాత్రం తగ్గకుండా..తనకు ఎంతైతే గౌరవం ఇస్తున్నారో..అంతే విధంగా పవన్ కళ్యాణ్ కు ఉండేలా చూసుకుంటున్నాడు
- Author : Sudheer
Date : 15-06-2024 - 1:05 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఈరోజు కూటమి పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే దానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కల్యాణే. ఆనాడు వైసీపీ సర్కార్ అక్రమంగా చంద్రబాబు ఫై పలు కేసులు నమోదు చేసి కనీసం బెయిల్ కూడా రాకుండా చేస్తున్న సమయంలో చంద్రబాబు కు దైర్యం నింపేందుకు వెళ్లి..ఏకంగా పొత్తు ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఆ రోజుతోనే రాష్ట్రంలో వైసీపీ పతనం మొదలైంది. ఓట్లను చీల్చనివ్వకూడదని చెప్పి బిజెపి అగ్ర నేతలతో మాట్లాడి టిడిపి – జనసేన – బిజెపి మూడు పార్టీల పొత్తు కుదిరేలా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. అంతే కాదు బీజేపీ కోసం తన సీట్లను సైతం తగ్గించుకున్నాడు. ఓ పక్క తన సామజిక వర్గం వారు , సొంత పార్టీ వారు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ఎక్కడ డౌన్ కాకుండా..ఎన్నికల్లో పాల్గొని తన పార్టీ అభ్యర్థులను గెలిపించడమే కాదు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడేలా చేసాడు.
We’re now on WhatsApp. Click to Join.
అందుకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ..అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గౌరవం ఏమాత్రం తగ్గకుండా..తనకు ఎంతైతే గౌరవం ఇస్తున్నారో..అంతే విధంగా పవన్ కళ్యాణ్ కు ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పటికే డిప్యూటీ సీఎంతో సహ కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కల్యాణ్‌కు కేటాయించిన చంద్రబాబు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి ఫొటోలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక, చంద్రబాబు తమ అభిమాన నేతకు సముచిత స్థానం కల్పిస్తుండటంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఖుష్ అవుతున్నారు. చంద్రబాబు ఆదేశంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇద్దరి ఫొటోలను ఏర్పాటు చేస్తున్నారు.
Read Also : Plants: మీ ఇంట్లో ఈ మొక్కలు ఉన్నాయా..? ఇవి రాంగ్ ప్లేస్ లో పెడితే ఏమవుతుందో తెలుసా..?