Minister Roja: మినిస్టర్ రోజాను క్లిక్ మనిపించిన వందలాది ఫొటోగ్రాఫర్లు…వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు..!
ఏపీ మినిస్టర్ రోజా విజయవాడలో నిర్వహించిన ఫొటోగ్రీ కార్నివాల్ ఎక్స్ పో కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఓ అద్భుతమైన సీన్ ఆవిష్క్రుతమైంది. వందలాదిమంది ఫొటోగ్రాఫర్లు ఒకేసారి రోజాను క్లిక్ మనిపించారు.
- Author : hashtagu
Date : 30-07-2022 - 10:39 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ మినిస్టర్ రోజా విజయవాడలో నిర్వహించిన ఫొటోగ్రీ కార్నివాల్ ఎక్స్ పో కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఓ అద్భుతమైన సీన్ ఆవిష్క్రుతమైంది. వందలాదిమంది ఫొటోగ్రాఫర్లు ఒకేసారి రోజాను క్లిక్ మనిపించారు. ఈ అరుదైన ఘట్టం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. ఇంతమంది ఫొటోగ్రాఫర్లు ఒకేవేదికపైకి రావడం…సంతోషంగా ఉందన్నారు. వాళ్లందరూ ఒకేసారి తనను ఫొటో తీయడం మరపురాని అనుభూతి కలిగిస్తోందని చెప్పారు. ఇవాళ్టి సమాజంలో కెమెరా మూడో కన్ను వంటిదని…కెమెరా లేకుంటే చరిత్ర లేదని..భవిష్యత్ ఉండదని రోజా అభిప్రాయపడ్డారు.
ఇక తన సినీప్రస్తానం మొదలుకావడానికి ఒక ఫొటోనే కారణమంటూ రోజా ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తెలిసీతెలియకుండా ఓ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో తనకు సినిమాల్లో అవకాశం తెచ్చిపెట్టిందన్నారు. ఆ ఫొటో చూసి తనను చూడకుండానే ప్రేమ తపస్సు మూవీలో అవకాశం ఇచ్చారని రోజా వివరించారు.
విజయవాడలో ఫోటో గ్రాఫర్స్ ''ఒన్ క్లిక్ ఆన్ సేమ్ టైం – వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్'' కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #ClickonSameTime #WonderBookofRecords pic.twitter.com/jOZKKQqkMt
— Roja Selvamani (@RojaSelvamaniRK) July 30, 2022