Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో
సనాతన ధర్మంతో నడిచే దేశంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని పవన్ హెచ్చరించిన వీడియోను పంచుకుంది
- By Sudheer Published Date - 09:19 PM, Sat - 8 June 24

మెగా అభిమానులు , జనసేన శ్రేణులు ఎంత హ్యాపీ గా ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. గత పదేళ్లు గా తమ అభిమాన హీరో (Pawan Kalyan) అసెంబ్లీ లో అడుగుపెట్టడం చూడాలని..పవర్ ఫుల్ పొలిటిషన్ గా చూడాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పనికిమాలిన వారి నోళ్లకు తాళం వేసే రోజు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూసారు..ఆ ఎదురుచూపులు 2024 ఎన్నికలు తెరదించాయి. నోళ్లు మూతపడడమే ..కాదు పవన్ కళ్యాణ్ ఫై నోరు పారేసుకున్న వారు అడ్రెస్ లేకుండా అయిపోయింది. పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ఇలా అవుతుందా అని అర్థమై రేంజ్ లో ప్రజలు సమాధానం ఇచ్చారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో సంచలన విజయం సాధించి..ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్పాడు పవన్. ఇక ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలన విజయం సాధించడం తో సోషల్ మీడియా లో అభిమానులు , జనసేన శ్రేణులు తమ టాలెంట్ ను చూపిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఐదేళ్ల లో ఏపీలోని హిందూ ఆలయాలపై జరిగిన దాడులను ఉద్దేశించి జనసేన ట్వీట్ చేసింది. సనాతన ధర్మంతో నడిచే దేశంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని పవన్ హెచ్చరించిన వీడియోను పంచుకుంది. ‘హద్దు దాటితే నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా’ అన్న పవన్ డైలాగ్, జనసేన ఘన విజయం, జనసేనానిపై మోదీ ప్రశంసలను వీడియోలో పొందుపరిచి గేమ్ ఛేంజర్ పీకే అంటూ పేర్కొంది. ఈ వీడియో అభిమానుల్లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా..!!#GameChangerPK pic.twitter.com/v9fdE7mUNC
— JanaSena Party (@JanaSenaParty) June 8, 2024
Read Also : YCP : వైసీపీ ఓటమికి కారణం ఐప్యాకే – కొట్టు సత్యనారాయణ