HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawankalyn Political Strategy Changed Whats Next

PK: త‌గ్గేదే లే! రాజకీయ చదరంగంలో ఆరితేరిన పవన్.. జనసేనాని పోరాటం స్టైల్ మార్చారా?

రాజ‌కీయాల్లోనూ హీరోయిజం చూపాల‌న్నదే జ‌న‌సైనికాధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కారానికి పోరాట‌మే త‌ప్ప‌, వంగి వంగి స‌లాములు చేసేది లేద‌న్న జనసేనాని మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

  • Author : Hashtag U Date : 21-02-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

రాజ‌కీయాల్లోనూ హీరోయిజం చూపాల‌న్నదే జ‌న‌సైనికాధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కారానికి పోరాట‌మే త‌ప్ప‌, వంగి వంగి స‌లాములు చేసేది లేద‌న్న జనసేనాని మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. త‌న‌దైన స్టైల్‌లో పంచ్ డైలాగ్‌లు విసురుతూ ప‌వనిజం అంటే ఇదీ అని చెప్పద‌ల‌చుకున్నారు. అధికారం ఇస్తే ఏమి చేస్తామో ఇప్పటి నుంచే చెప్పడం చూస్తుంటే.. పవన్ టార్గెట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

తొలుత మ‌త్స్యకారుల‌కు చెందిన స‌మ‌స్యపై త‌న సొంత జిల్లా న‌ర‌సాపురంలో ఆందోళ‌న ప్రారంభించారు. చెరువులు, కుంట‌ల్లో చేప‌లు ప‌ట్టాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో వాటి వివ‌రాలు న‌మోదు చేయాల‌ని, మ‌త్స్యకారులు అడ్వాన్సుగా 25 శాతం చెల్లించాలంటూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబ‌రు 217ను తీసుకొచ్చింది. ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి జీవో లేదంటూ ఉద్యమానికి శ్రీ‌కారం చుట్టారు.

జ‌న‌సేన‌కు క‌నీసం ప‌ది మంది ఎమ్మెల్యేల‌ను ఇచ్చి ఉన్నా ఇలాంటి జీవో ఇచ్చే సాహ‌సం ప్రభుత్వానికి ఉండేది కాదంటూ ప్రజ‌ల మ‌ద్దతు కూడ‌గ‌ట్టుకునే ప్రయ‌త్నం చేశారు పవన్ కల్యాణ్. రాచ‌రికం వైఖ‌రితో వ్యవ‌హ‌రించే వైసీపీ వారికే ఇలాంటి జీవోలు ఇచ్చే తెగింపు ఉంటే, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల ఆద‌ర్శాల‌తో ప‌ని చేస్తున్న త‌మ‌కు పోరాడే శ‌క్తి ఇంకా చాలా ఉందని స్పష్టం చేశారు. జైలుకైనా వెళ్తాను గానీ, త‌ల‌వంచేదే లేద‌ని చెప్పి ప్రజ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్రయ‌త్నం చేశారు.

ఆందోళ‌న‌లో ముందు న‌డుస్తాన‌ని, తొలి దెబ్బను తానే తింటాన‌ని చెప్పడం ద్వారా త‌న హీరోయిజాన్ని చాటుకునే ప్రయ‌త్నం చేశారు. ప‌ది మందికి మేలు చేసే వారికి పాదాభివంద‌నం చేస్తాన‌ని, అహంకారంతో వ్యవ‌హ‌రించే వారి విష‌యంలో త‌ల తెగిపోయినా స‌రే వెన‌క్కి త‌గ్గబోన‌ని ప‌వ‌ర్‌ఫుల్‌గా చెప్పారు. మార్చి 14న జ‌ర‌గ‌నున్న జ‌న‌సేన ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా ఈ ఉద్యమాన్ని మ‌రింత ముందుకు తీసుకువెళ్లే విష‌య‌మై పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన స్ట్రాటజీతో అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • Jana Sena
  • Pawan Kalyan

Related News

Jagan

Ys Jagan Plan B: రాజధానిపై జగన్‌ ప్లాన్‌ బీ.. మావిగన్ పేరుతో తెరపైకి కొత్త ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ అమరావతితో సహా ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదన్నారు. అలాగే ప్లాన్ బీ అంటూ సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కేపిటల్ ఏరియాగా ప్రకటించాలన్నారు. ఈ ప్రాంతానికి కొత్త పేరును సూచించారు. భవిష్యత్తులో ఇది గ్రోత్ ఇంజిన్ అవుతుందని జగన్ చెప్పుకొచ్చారు.

  • Pawan Kalyan Ustad Bhagat Singh Working stills released from Movie Unit Shootings not stopped with Chandrababu Arrest

    Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

  • Pawan Prakash Raj

    ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

  • Pawan Speech Assembly

    AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

Latest News

  • రామాయణ మూవీలో ల‌క్ష్మ‌ణుడి పాత్ర చేసింది ఎవ‌రంటే?

  • పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

  • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

  • భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

  • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

Trending News

    • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd