AP Assembly : కూటమి ప్రభుత్వానికి ఎవరైనా ఇబ్బందులు కలుగజేస్తే ..అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు
భవిష్యత్తు, పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి తాము పూర్తి సహకారం అందిస్తామని పవన్ చెప్పుకొచ్చారు
- By Sudheer Published Date - 09:08 PM, Tue - 23 July 24

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) నిన్నటి నుండి మొదలైన సంగతి తెలిసిందే. నిన్న గవర్నర్ ప్రసంగం జరుగగా..నేడు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ సందర్భాంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రసంగిస్తూ..గత వైసీపీ ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేసిందని , కనీసం సర్పంచ్‌లకు గౌరవం లేదని ప్రస్తావించారు.
We’re now on WhatsApp. Click to Join.
కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చినా పంచాయతీ ఖాతాలకు వెళ్లలేదని, పంచాయతీలకు విడుదల చేసిన 9 వేల కోట్ల రూపాయల గ్రాంటును గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఈ మళ్లింపుపై కమిషన్ వేసి అక్రమాలపై నిగ్గు తేలుస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. భవిష్యత్తు, పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి తాము పూర్తి సహకారం అందిస్తామని పవన్ చెప్పుకొచ్చారు. ఉచిత ఇసుక వంటి వ్యవహారాల్లో జనసేన సభ్యుల పాత్ర ఉండకూడదు. కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగజేసేలా వ్యవహరిస్తే ఏ సభ్యుడినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని పవన్ అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేయాలి అని తెలిపారు. ‘నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Read Also : IPL 2025: హిట్ మ్యాన్ పై కన్నేసిన ఫ్రాంచైజీలు, రోహిత్ కోసం పోటీపడే జట్లు ఇవే