Pawan Kalyan : కొడాలి నానిని ఓడించి సంబరాలు చేసుకుందాం
బూతులు తిట్టేవాళ్లను సాగనంపాలంటూ ఇన్ డైరెక్ట్ గా కొడాలి నాని ఫై విరుచుకపడ్డారు
- Author : Sudheer
Date : 04-05-2024 - 4:10 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారంలో తనదైన దూకుడు కనపరుస్తున్నాడు..గతంలో కాస్త ఎక్కువ ప్రవచనాలు చెపుతూ..కార్యకర్తల్లో జోష్ నింపలేకపోయిన పవన్..ఇప్పుడు మాత్రం కార్యకర్తల్లో జోష్ నింపడమే కాదు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. ముఖ్యంగా జగన్ ఫై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తూనే..ప్రజల్లో కూటమి ఫై నమ్మకం పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు కొడాలి నాని (Kodali Nani) అడ్డాలో తనదైన స్టయిల్లో డైలాగ్స్ పేల్చాడు. బూతులు తిట్టేవాళ్లను సాగనంపాలంటూ ఇన్ డైరెక్ట్ గా కొడాలి నాని ఫై విరుచుకపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
‘ఎవరైనా చెరువులు తవ్విస్తారు.. కానీ వైసీపీ వాళ్లు కబ్జా చేశారు. బూతులు తిట్టేవాళ్లను, గోతులు తవ్వేవాళ్లను సాగనంపాలి. రాజకీయ నేతల బూతులు, దాడులకు పన్ను వేస్తే నిధులకు కొరతే ఉండదు. ఇంట్లో ఉన్నవాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ ప్రభుత్వం.. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప చేసిందేమీ లేదన్నారు. జగన్ ను చూసి, వైసీపీ నాయకులను చూసి భయపడాలా? అని ప్రశ్నించారు. జగన్.. నువ్వంటే నాకు భయంలేదు.. నా సినిమాలు ఆపితే ఆపుకో అని అన్నారు. మన నేలను విడిచి ఎక్కడికి పారిపోతాం.. మీ గుండెల్లో ధైర్యం నింపడానికే నేనొచ్చా. మాటిస్తే ప్రాణాలు పోవాలిగానీ.. వెనక్కి తీసుకోకూడదు’ అని పవన్ కల్యాణ్ అన్నారు. గుడివాడలో రోడ్లంతా గోతుల మయం.. స్థానిక ఎమ్మెల్యే నోరు బూతుల మయమని చెప్పుకొచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని.. బీజేపీ అధిష్టానంతో మాట్లాడి ప్రజల కోసం నిలబడ్డామన్నారు. కూటమి అదికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
Read Also : FIH Pro League: 24 మంది సభ్యులతో భారత మహిళల హాకీ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?