Pawan Kalyan : ‘జనసేన’ కాదు ‘మత సేన’ అంటూ షర్మిల ఫైర్
Pawan Kalyan : 'పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ప్రజా ఉద్యమాలకు మద్దతుగా ఉండేవారని, కానీ ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని అనుసరిస్తూ మతపరమైన రాజకీయాలకు అడుగుపెడుతున్నారని ఆరోపించారు
- By Sudheer Published Date - 11:00 PM, Sun - 16 March 25

జనసేన పార్టీ (Janasenaparty) మతపరమైన పార్టీగా మారిపోయిందని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. తొలిసారి పవన్ కళ్యాణ్ పై షర్మిల తీవ్రస్థాయి లో విరుచుకపడ్డారు. జనసేనను “ఆంధ్ర మతసేన” గా అభివర్ణించారు. తాజాగా పిఠాపురంలో జరిగిన “జయ కేతన” సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం పై చాలామంది తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షర్మిల సైతం పవన్ స్పీచ్ పై మండిపడ్డారు.
CM Revanth : జనగాం జిల్లాలో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
షర్మిల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ప్రజా ఉద్యమాలకు మద్దతుగా ఉండేవారని, కానీ ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని అనుసరిస్తూ మతపరమైన రాజకీయాలకు అడుగుపెడుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చేగువేరా, గద్దర్ ఆశయాలను మర్చిపోయి మోడీ, అమిత్ షాల విధానాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలతో ప్రారంభమైన జనసేన ఇప్పుడు పూర్తిగా బీజేపీకి వశమై పోయిందని, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మారిపోయిందని విమర్శించారు.
Nightclub Fire : నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 51 మంది సజీవ దహనం
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని, ప్రజల ఆకాంక్షలను పక్కనపెడుతున్నారని షర్మిల అన్నారు. ప్రజాస్వామిక సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించేలా జనసేన వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, పవన్ కళ్యాణ్ వెంటనే బీజేపీ ప్రభావం నుంచి బయటపడాలని సూచించారు. 11 ఏళ్లుగా రాజకీయ పోరాటం చేసి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పవన్, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని షర్మిల హితవు పలికారు.