Papam Pasivadu: సీఎం జగన్ ‘పాపం పసివాడు’
నిన్న మత్స్యకారుల భరోసా సభలో సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ
- Author : Praveen Aluthuru
Date : 17-05-2023 - 2:52 IST
Published By : Hashtagu Telugu Desk
Papam Pasivadu: నిన్న మత్స్యకారుల భరోసా సభలో సీఎం జగన్(CM Jagan) వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… హింస మరియు అక్రమ సంపాదనతో సీఎం జగన్ రెచ్చిపోతున్నారని విమర్శించారు. జగన్ ఏమీ.. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఓ సినిమా తీస్తే బాగుండు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా సీఎం జగన్ పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేసిన విషయం విదితమే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోడు దొంగలని, ఆ ఇద్దరికీ ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదంటూ విమర్శించారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు అధికారం కోసమే తాపత్రయపడుతున్నారని, వారిద్దరికీ రాష్ట్ర ప్రజలపై ఎటువంటు ప్రేమ లేదన్నారు. పొత్తులతో రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా 175 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితుల్లో దత్తపుత్రుడు లేడంటూ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై తాజాగా పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.
సీఎం జగన్ పై పాపం పసివాడు (Papam Pasivadu) సినిమా తీయాలని అన్నారు. ఎవరైనా జగన్ పై పాపం పసివాడు సినిమా తీస్తే బాగుండు అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పాపం పసివాడు పోస్టర్ పోస్ట్ చేస్తూ…. సీఎం జగన్ నువ్వేమీ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కాదని, అలాగే తరిమెల నాగిరెడ్డి కాదని విమర్శించారు. పోస్టర్ లో చూపించిన విధంగా పసివాడు చేతిలో సూటికేసు ఉన్నట్టు కాకుండా జగన్ చేతిలో సూటికేసు కంపెనీలు పెట్టాలన్నారు. ఎందుకంటే జగన్ ఆ సూటికేసుల ద్వారానే అక్రమ సంపాదన తరలిస్తాడని విమర్శించారు.త్వరలోనే సీఎం జగన్ నుంచి రాయలసీమ విముక్తి పొందుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్.
Read More: BRS alliance : కేసీఆర్ మహా కూటమి! రేవంత్ కు చిక్కులే!!