HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan To Contest From Tirupati

Pawan Kalyan : తిరుపతి నుండి జనసేనాని పోటీ..?

తిరుపతిలో కాపు కమ్యూనిటీకి చెందిన బలిజలు ఎక్కువ మంది ఉంటారు. ఇది పవన్‌కు అనుకూలంగా మారుతుందని చంద్రబాబు అంచనా వేశారు. 2009లో పవన్ సోదరుడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించారు

  • Author : Sudheer Date : 08-10-2023 - 5:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan To Contest Fro
Pawan Kalyan To Contest Fro

రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) తిరుపతి (Tirupati Assembly constituency) నుండి బరిలోకి దిగబోతున్నారా..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక (Gajuwaka Constituency) , భీమవరం (Bhimavaram Constituency) నుండి పోటీ చేసి , రెండు స్థానాల్లో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా..రెట్టింపు ఉత్సహంతో ప్రజలకోసం పనిచేస్తూ ప్రజల మెప్పుపొందుతు వస్తున్నాడు. మరికొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎన్నికలు తగ్గపోరు గా ఉండబోతున్నాయి.

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అక్రమ కేసులో చంద్రబాబు ను అరెస్ట్ చేసి జైల్లో వేశారని యావత్ తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..బాబుకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో టీడిపి తో కలిసి పోటీ (TDP Janasena Alliance)చేయబోతున్నట్లు ప్రకటించి టిడిపి శ్రేణుల్లో ధైర్యం నింపారు. ప్రస్తుతం రెండు పార్టీలు కలిసి కార్యాచరణ చేపడుతూ వస్తున్నాయి. అయితే రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను తిరుపతి నుండి పోటీ చేయాలనీ చంద్రబాబు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు (Chandrababu) ఈ స్థానం నుండి పోటీ చేయమని చెప్పడం వెనక ప్రత్యేక కారణం ఉందని అంటున్నారు. తిరుపతిలో కాపు కమ్యూనిటీకి చెందిన బలిజలు ఎక్కువ మంది ఉంటారు. ఇది పవన్‌కు అనుకూలంగా మారుతుందని చంద్రబాబు అంచనా వేశారు. 2009లో పవన్ సోదరుడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో పాలకొల్లు నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ ను తిరుపతి నుండి పోటీ చేయాలనీ చంద్రబాబు కోరారట.

పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే (Pawan Kalyan To Contest From Tirupati).. చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేసే టీడీపీ/ జనసేన నేతలకు కలిసి వస్తోందని చంద్రబాబు భావిస్తున్నారు. రాయలసీమలో కడపతోపాటు చిత్తూరులో వైసీపీ బలంగా ఉంది. పవన్ పోటీ చేయడంతో వారి ప్రాబల్యం తగ్గించొచ్చు అని చంద్రబాబు ప్లాన్. మరి చంద్రబాబు సూచనమేరకు పవన్ తిరుపతి నుండి పోటీ చేస్తారా..? నిజంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తిరుపతి నుండి పోటీ చేయమని సూచించారా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : Venkaiah Naidu : రాజకీయ నేతలు పార్టీలు మారడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Contest From Tirupati
  • Pawan Kalyan
  • pawan tirupathi

Related News

Pawan Kalyan Ustad Bhagat Singh Working stills released from Movie Unit Shootings not stopped with Chandrababu Arrest

Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

రాబోయే రోజుల్లో ఏవైనా సెలవు దినాలు కలిసి వస్తే తప్ప, ఈ 100 కోట్ల గ్రాస్ టార్గెట్ రీచ్ అవ్వడం సవాలుతో కూడుకున్న పని. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరియు సినిమాల మధ్య ఉన్న గ్యాప్ వల్ల అభిమానులు

    Latest News

    • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

    • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

    • BSNL బంపర్ ఆఫర్.. 1 రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్

    • Rakasa Day 4 Collections: ‘రాకాస’ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    Trending News

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

      • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd