Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన ఖరారు
Pawan Kalyan : అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం 4గంటలకు పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకి అలిపిరి చేరుకుని మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్లనున్నారు
- By Sudheer Published Date - 09:46 AM, Sun - 29 September 24

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తిరుమల షెడ్యూల్ (Tirumala Schedule) ఫిక్స్ అయ్యింది. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డు అపవిత్రమైందని చెప్పి..పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష (Prayaschitta Diksha) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాయశ్చిత దీక్షను అక్టోబర్ 3వ తేదీన తిరుమలలో విరమించనున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తిరుమల షెడ్యూల్ ఖరారైంది.
అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం 4గంటలకు పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకి అలిపిరి చేరుకుని మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి 9గంటలకి తిరుమలకు చేరుకుని అక్కడే బస చేయనున్నారు. మరుసటి రోజు అనగా అక్టోబర్ 3వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత దీక్షను విరమిస్తారు. ఆ తర్వాత సాయంత్రం తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో పవన్ పాల్గొననున్నారు.
మరోపక్క అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ అధికారులు పవన్ కళ్యాణ్ కు ఆహ్వాన పత్రిక ను అందించారు. అనంతరం పవన్‌కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందించారు. అయితే కొద్దిరోజుల క్రితమే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలిసి ఆహ్వాన పత్రిక అందించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత దీక్షను పల్లెపల్లెకు తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా చేపట్టే కార్యక్రమ వివరాలను జనసేన ట్వీట్ చేసింది. SEP 30న రాష్ట్రవ్యాప్తంగా దీపారాధాన, అక్టోబర్ 1న ఓం నమో నారాయణయ మంత్ర పఠనం, 2న నగర సంకీర్తన, 3న ఆలయాల్లో భజన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపింది.
Read Also : Telangana Tax Revenue : ఆగస్టులో రూ.13వేల కోట్లు.. తెలంగాణ పన్ను ఆదాయానికి రెక్కలు