Pawan Kalyan : మరోసారి వాలంటీర్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్.. వ్యక్తిగత సమాచారం వాలంటీర్లకు ఎందుకు??
నేడు మరోసారి పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దెందులూరు నియోజకవర్గ శ్రేణులతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
- Author : News Desk
Date : 11-07-2023 - 8:17 IST
Published By : Hashtagu Telugu Desk
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర(Varahi Yatra) రెండో షెడ్యూల్ మొదలైన సంగతి తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా ఇటీవల ఏలూరు(Eluru)లో భారీ బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా సమాచారం కలెక్ట్ చేసి అధికార ప్రభుత్వానికి చెందిన కొందరు వుమెన్ ట్రాఫికింగ్(Women Trafficking) కి పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ(YCP) నాయకులు ఫైర్ అవుతున్నారు. మరో పక్క వాలంటీర్లు కూడా పవన్ పై ఫైర్ అవుతూ ధర్నాలు, పవన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. వాలంటీర్లకు పవన్ క్షమాపణలు చెప్పాలని అంటున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కి ఏపీ మహిళా కమీషన్(AP Women’s Commission) నోటీసులు కూడా ఇచ్చింది.
దీనిపై పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు రెండు రోజుల నుంచి ఆ వ్యాఖ్యలని కవర్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆ వ్యాఖ్యలని తప్పుగా ప్రమోట్ చేశారని, వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లతో ఊడిగం చేయించుకుంటుందని మాట్లాడుతున్నారు. జనసేన సోషల్ మీడియాలో వరుసగా వాలంటీర్లకు సపోర్ట్ గా పోస్టులు చేస్తున్నారు. అయితే నేడు మరోసారి పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా దెందులూరు నియోజకవర్గ శ్రేణులతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థపై, వాలంటీర్లపై నాకు కోపం లేదు. తిరుపతి జనవాణిలో వాలంటీర్ల వేధింపులపై మహిళల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ఏమి అనలేకపోతున్నాం, ప్రభుత్వం పంపిందని అంటున్నారని వాపోయారు. రాష్ట్రంలో మహిళలు మిస్ అయిపోయిన కేసులు కూడా అత్యధికంగా నమోదు అవుతున్నాయి. వాలంటీర్ల వద్ద ఇంటి గుట్టు మొత్తం ఉంటుంది, వ్యక్తిగత డేటా బహిర్గతం అవుతుంది. వేశ్య లకు కూడా ఒక హక్కు ఉంటుంది, అలాంటిది ఆడబిడ్డ రహస్యాలు బహిర్గతం చేసి స్వేచ్ఛ హరిస్తున్నారు. ఏ ఒక్క కుటుంబ వ్యక్తిగత సమాచారం వాలంటీర్లకు ఎందుకు, వాలంటీర్లకు 5000 జీతం ఇచ్చి వైసీపీ ప్రభుత్వం ఊడిగం చేయించుకుంటుంది అని అన్నారు. దీంతో మరోసారి పవన్ వ్యాఖ్యలు ఏపీలో చర్చగా మారాయి.
Also Read : Power War : అరెస్ట్ కు సిద్ధం? పవన్ ను పిచ్చోడ్ని చేసిన రోజా!