HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Questions Ys Jagan On Railway Lines

Pawan Kalyan On Jagan : ‘జగన్’ సర్కార్ పై ‘పవన్’ ఫైర్…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఎందుకు జాప్యం అవుతున్నాయో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణతో ఇక్కడి వైసీపీ ప్రభుత్వ వైఖరి అందరికీ తేటతెల్లమైందని అన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్

  • Author : Hashtag U Date : 10-02-2022 - 2:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఎందుకు జాప్యం అవుతున్నాయో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణతో ఇక్కడి వైసీపీ ప్రభుత్వ వైఖరి అందరికీ తేటతెల్లమైందని అన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అభివృద్ధిలో భాగమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పూర్తి కావల్సిన ఈ ప్రాజెక్టులు, జగన్ ప్రభుత్వ అలసత్వం వల్లే జాప్యం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చాల్సిన నిధులను విడుదల చేయకపోతే పనులు ఎలా సాగుతాయన్న పవన్…. కీలకమైన రైల్వే లైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయని ఎద్దేవా చేశారు. కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ అనేది ఎప్పటి నుంచో వింటున్నదే. ఈ ప్రాజెక్టుకు 25% వాటా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ మొత్తాన్ని ఇవ్వకపోవడంతో ముందుకు వెళ్ళడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.358 కోట్లు ఇస్తే పనులు మొదలవుతాయి. ఈ రైల్వే లైను పూర్తి చేస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనిపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. అలాగే నడికుడి – శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు రూ.1351 కోట్లు, కడప – బెంగళూరు లైనుకు రూ.289 కోట్లు, రాయదుర్గం – తుముకూరు లైనుకు రూ.34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. నిధులు ఇవ్వరు, భూసేకరణ కూడా చేయరు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత విస్మరిస్తే రైల్వే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి? మౌలిక వసతుల అభివృద్ధి ఏ విధంగా సాధ్యం అవుతుంది. ఇలాగైతే ఈ లైన్లు ఎప్పటికి పూర్తవుతాయి. విశాఖ రైల్వే జోన్ ప్రకటన అయినా అది కార్యరూపం దాల్చే విధంగా చేయడంలో వైసీపీ ఎంపీలు విఫలం అవుతున్నారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయించలేరు… ప్రకటన అయిన జోన్ ను ముందుకు తీసుకువెళ్ళేందుకు చిత్తశుద్ధితో కృషి చేయలేరు. రైల్వే లైన్ల పూర్తికి ఆ శాఖ మంత్రి చెప్పిన సమాధానంలో అంశాలను ముఖ్యమంత్రికి వివరించి రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయించాల్సిన బాధ్యత వైసీపీ ఎంపీలపై ఉందని చెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Pawan Kalyan
  • South Central Railways
  • ys jagan

Related News

Jagan Pawan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

గతంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ విలాసాలకు పాల్పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, దీనిపై కూటమి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd