Pawan Kalyan Pedana : పెడన సభలో మత్స్యకారులకు కీలక హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
జీవో నెం.217 తీసుకొచ్చి మత్య్సకారుల పొట్ట కొట్టారని, కూటమి అధికారంలోకి వస్తే తీర ప్రాంతాల్లో జెట్టీలు నిర్మిస్తామని కీలక హామీ ఇచ్చారు
- By Sudheer Published Date - 09:33 PM, Wed - 17 April 24

ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీల నేతలు రెట్టింపు ఉత్సాహంతో జోష్ నింపుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు తన వయసును సైతం లెక్క చేయకుండా ప్రచారంలో తన దూకుడు కనపరుస్తున్నారు. ఓ పక్క సూపర్ సిక్స్ ను తెలియజేస్తూనే..అధికార పార్టీ ఫై నిప్పులు చెరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ సైతం ఘాటైన విమర్శలతో వైసీపీ నేతలకు చెమటలు పట్టిస్తున్నారు. ఈరోజు పెడన లో టీడీపీ అధినేత చంద్రబాబు తో కలిసి పర్యటించారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..మత్య్సకారులకు వైసీపీ సర్కార్ చేస్తున్న అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెం.217 తీసుకొచ్చి మత్య్సకారుల పొట్ట కొట్టారని, కూటమి అధికారంలోకి వస్తే తీర ప్రాంతాల్లో జెట్టీలు నిర్మిస్తామని కీలక హామీ ఇచ్చారు. అలాగే మత్య్సకారులకు ఉపాధి కల్పించే బాధ్యతను కూడా తీసుకుంటామని తెలిపారు. ఇక పెడన ఎమ్మెల్యేపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పెడనలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యేకు లంచం ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. మట్టి మాఫియా రెచ్చిపోతోందని.. ప్రశ్నించిన వ్యక్తులను చెట్టుకు కట్టి మరీ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులను సైతం ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ మద్యం, ఇసుక, భూదందాల డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. మావద్ద డబ్బు లేదు, నీతి, నిజాయతీ ఉందని పేర్కొన్నారు. బాబాయ్‌ని హత్య చేసి, కోడికత్తి డ్రామా ఆడిన జగన్ ఇప్పుడు మళ్లీ గులకరాయి డ్రామా ఆడుతున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. సభకు వస్తే ఇస్తానన్న డబ్బులివ్వలేదని ప్రజలు చెప్తున్నారని దుయ్యబట్టారు. తమ మీద వేసిన రాళ్లు దొరికాయి. కానీ, జగన్ మీద వేసిన గులక రాళ్లు దొరకలేదని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కడం తప్ప జగన్‌కేం తెలియదని, బటన్ నొక్కడానికి జగన్ కావాలా?, ఇంట్లో ఉన్న ముసలమ్మ కూడా నొక్కుతుందని ఎద్దేవా చేశారు.
Read Also : Pawan Kalyan Nomination : పవన్ నామినేషన్ ముహూర్తం ఫిక్స్..