Palle Panduga : వైసీపీ హయాంలో నిధులన్నీ మాయం ..ఆ లెక్కలు కూడా దొరకడం లేదు – పవన్
Palle Panduga : ప్రభుత్వ పనితీరులో ఎలాంటి గుట్టు లేదని, ఓపెన్‌గానే చేస్తున్నామని , తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో 4500 కోట్ల రూపాయలతో పనులకు శ్రీకారం చుట్టామని
- Author : Sudheer
Date : 14-10-2024 - 3:23 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..గత వైసీపీ ప్రభుత్వం (YCP Govt) పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏ శాఖలోనూ డబ్బులు లేకుండా చేసారని..కేంద్ర నిధులే కాదు , రాష్ట్ర నిధులు కూడా మాయం చేసారని..అసలు ఐదేళ్ల వైసీపీ హయాంలో వేలకోట్లు ఖర్చు చేశామని లెక్కలు ఉన్నాయి..కానీ దేనికి ఎంత ఖర్చు చేసారో అనేది తెలియని పరిస్థితి ఏర్పడిందని పవన్ అన్నారు.
సోమవారం కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన పల్లె పండుగ (Palle Panduga) కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తాము ఏం చేస్తాన్నామో తెలియాలంటే.. గత ప్రభుత్వానికి- కూటమి ప్రభుత్వానికి కంపేర్ చేయాలన్నారు. ప్రభుత్వ పనితీరులో ఎలాంటి గుట్టు లేదని, ఓపెన్‌గానే చేస్తున్నామని , తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో 4500 కోట్ల రూపాయలతో పనులకు శ్రీకారం చుట్టామని , . ప్రజలు తమ గ్రామాల కోసం తీర్మానం చేసిన పనులన్నీ చేస్తున్నామని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎప్పుడైనా ప్రజా సమస్యలను పరిష్కరించారా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. వారెప్పుడైనా ప్రజల సమస్యలపై ఇలా స్పందించారా..? ఎంతసేపు వారి నోటి వెంట బూతులు, తిట్లు తప్ప, ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కానరాలేదు” అని పవన్ విమర్శించారు.
ప్రతి గ్రామంలో పనుల పురోగతి, నిధులు చెల్లింపుపై డిస్ ప్లే బోర్టులు ఏర్పాటు చేశాం. మేము పారదర్శకంగా ఉన్నప్పటికీ.. అధికారులు కూడా బాగా పని చేయాలి. ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి నా పేరు చెప్పి డబ్బులు అడగినట్లు తెలిసింది. నా దృష్టికి రాగానే విచారణ చేసి, అవసరమైతే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. అవినీతి అధికారులు మాకు వద్దు. ఎవరు లంచం పేరుతో ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురండి. మేము ప్రజలకు సేవ చేయడానికే వచ్చాం.. అభివృద్ధి చేయడం మా బాధ్యత అని తెలిపారు.
Read Also : Attack On Anchor Kavya Sri : లేడి యాంకర్ పై మార్గాని భరత్ అనుచరుడు దాడి