Pawan Kalyan : పిఠాపురంలో పర్యటించబోతున్న పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని పిఠాపురం నుండి మొదలుపెట్టబోతున్నారు. వచ్చే వారం పిఠాపురంలో పవన్ పర్యటించబోతున్నట్లు తెలుస్తుంది
- By Sudheer Published Date - 08:32 PM, Mon - 18 March 24

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) పిఠాపురం ( Pithapuram )లో ప్రకటించబోతున్నారు. త్వరలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్.. పిఠాపురం నుండి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. రెండు చోట్ల ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పక్కా వ్యూహం తో బరిలోకి దిగిపోతున్నారు. జగన్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్.. టిడిపి, బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి దిగబోతున్నారు . ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని పిఠాపురం నుండి మొదలుపెట్టబోతున్నారు. వచ్చే వారం పిఠాపురంలో పవన్ పర్యటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు పవన్ పర్యటనకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక పిఠాపురంలో కాపు ఓట్లు ఎక్కువగా ఉండడం తో పవన్ ఇక్కడి నుండి పోటీచేస్తే భారీ విజయం సాధిస్తారని జనసేన (Janasena) వర్గాలు భావిస్తున్నాయి. పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటన వచ్చిన దగ్గరి నుండి కూడా నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ను భారీ మెజార్టీ తో గెలిపిస్తామని ధీమాగా చెపుతున్నారు. కాకపోతే కొంతమంది టిడిపి శ్రేణులు మాత్రం పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ స్థానం నుండి బరిలోకి దిగబోతున్న విషయం ప్రకటించిన వెంటనే స్థానిక టిడిపి నేత వర్మ..టిడిపి అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. వర్మ (Varma) అనుచరులు రోడ్ పైకి వచ్చి ఆందోళన చేసారు. టీడీపీ వర్మను మోసం చేసిందని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెడుతూ చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లకు వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేశారు. వర్మకు టికెట్ ఇవ్వాలని లేకుంటే.. టీడీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అనుచరులు అల్టిమేటం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు వర్మ ను పిలిచి బుజ్జగించారు. దీంతో ఆయన శాంతించారు. కానీ లోపల మాత్రం కాకమీదనే ఉన్నాడని అంటున్నారు. మరి పవన్ పర్యటన కు ఆయన సహకరిస్తారా..లేదా అనేది చూడాలి.
Read Also : Sajjala Khichdi: పిల్లలు ఎంతో ఇష్టపడే సజ్జల మసాలా కిచిడి..ట్రై చేయండిలా?