Pawan Kalyan : కొడుకు అకిరాను ప్రధాని మోడీకి పరిచయం చేసిన పవన్ కల్యాణ్
పవన్ తన కుమారుడు అకిరా నందన్‌ను ప్రధానికి పరిచయం చేశారు. అకిరా కూడా ప్రధానికి చేతులు జోడించి నమస్కరించాడు
- By Sudheer Published Date - 04:46 PM, Thu - 6 June 24

ఏపీలో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ , 21 లోక్ సభ స్థానాల్లో విజయ డంఖా మోగించి తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ విజయం తో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎంతటి ఘన విజయం సాధించడం వెనుక కీలక పాత్ర పోషించింది పవన్ కల్యాణే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ చేసిన కృషి..పోరాటం..త్యాగం ఇవన్నీ ఈరోజు కూటమి విజయం వెనుక నిలిచాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా సేనాని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అంతే కాదు తన పార్టీ తరుపున 21 స్థానాల్లో బరిలో నింపి వారి విజయానికి కారణమయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా.. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు నిన్న తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్ (Akira Nandan)తో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నివాసంలో మోడీ (Modi)ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ తన కుమారుడు అకిరా నందన్‌ను ప్రధానికి పరిచయం చేశారు. అకిరా కూడా ప్రధానికి చేతులు జోడించి నమస్కరించాడు. ఈ సందర్భంగా మోదీ అకిరా నందన్ మీద చేయి వేసి మాట్లాడుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అలాగే కూటమి విజయం సాధించిన తర్వాత కూడా చంద్రబాబు నేరుగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ కు వచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా చంద్రబాబు కు తన భార్య , కుమారుడి ని పవన్ బాబు కు పరిచయం చేసాడు.
Read Also : Jagan : వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి – జగన్ ట్వీట్