Pawan Kalyan: క్రూడ్ ఆయిల్ ఎంత విలువ అయునదో డేటా అంత విలువైనది.. !
ఆంధ్రప్రదేశ్ లో డేటా చోరీ అంశం ప్రధాన వార్తగా మారింది. అక్కడ వాలంటీర్లు వ్యవస్థ డేటా చోరీకి పాల్పడుతుందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
- Author : Praveen Aluthuru
Date : 23-07-2023 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో డేటా చోరీ అంశం ప్రధాన వార్తగా మారింది. అక్కడ వాలంటీర్లు వ్యవస్థ డేటా చోరీకి పాల్పడుతుందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అంతకుముందు డేటా ఆధారంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్టు సంచలన ఆరోపణలు గుప్పించారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పవన్ వ్యాఖ్యలను వైసీపీ ఖండించింది. వాలంటీర్లపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడంటూ ఎటాక్ చేసింది. దీంతో పవన్ కాస్త వెనక్కితగ్గి, హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని పక్కనపెట్టి డేటా చోరీ అనే అంశాన్ని లేవనెత్తారు. క్రూడ్ ఆయిల్ ఎంత విలువ అయునదో డేటా అంత విలువైనది అంటూ పవన్ తెలిపారు.
క్రూడ్ ఆయిల్ ఎంత విలువైందో డేటా అంత విలువైనదని చెప్పారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. వ్యక్తి పర్సనల్ సమాచారం, కులం, మతం, బ్యాంక్ ఎకౌంట్, ఇతరత్రా వివరాలు చేసి సేకరించడం అనేది క్రూడ్ ఆయిల్ అంత విలువైనదని పేర్కొన్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత డేటాని భద్రపరుచుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్. 21 వ శతాబ్దంలో డేటా అనేది న్యూ ఆయిల్ గా మారింది. బ్రిటీష్ డేటా సైన్టిస్ట్ 2006లో డేటా అనేది న్యూ ఆయిల్ గా చెప్పాడని పవన్ గుర్తు చేశాడు. డేటా ప్రొటెక్షన్ లో భాగంగా నా డేటా నా హక్కు అని చెప్తూ వాలంటీర్లు వ్యవస్థకు జనసేన ఛాలెంజ్ విసిరింది.
Also Read: Diet Charges Hike: విద్యార్థులకు శుభవార్త…డైట్ చార్జీల ఫైల్ పై సంతకం చేసిన సీఎం కేసీఆర్