HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Comments On Cm Ys Jagan Convoy

Pawan Kalyan: ‘కాన్వాయ్ ఘటన’కు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి!

ప్రయాణీకులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకొనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందని అన్నారు పవన్ కళ్యాణ్.

  • Author : hashtagu Date : 21-04-2022 - 2:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan
Pawan

ముఖ్యమంత్రి జగన్ జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణీకులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకొనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సీఎం పర్యటన లాంటివి ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న ట్రావెల్ ఆపరేటర్ల నుంచి వాహనాలు అద్దెకు తీసుకోవడం గురించి విన్నామే తప్ప, ప్రయాణంలో ఉన్నామని చెబుతున్నా పట్టించుకోకుండా వాహనం తీసుకొనే పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. బుధవారం రాత్రి ఒంగోలు నగరంలో వేమల శ్రీనివాస్ గారి కుటుంబం తిరుమల వెళ్తుంటే రవాణా శాఖ అధికారులు బలవంతంగా వారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం విస్మయానికి గురి చేసింది.

సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణీకులను నడిరోడ్డున దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకోవల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది? రూ.2.56 లక్షల బడ్జెట్ కలిగి… రూ.7.77లక్షల కోట్లు అప్పు తెచ్చుకొన్న సామర్థ్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం… ముఖ్యమంత్రి పర్యటనకు ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు తీసుకోవడం ఏమిటి? ముఖ్యమంత్రి భద్రత పర్యవేక్షించే అధికారులు కాన్వాయ్ లో ప్రైవేట్ వాహనాలు అనుమతిస్తున్నారా… అనుమతిస్తే ఏ ప్రాతిపదికన ఆ వాహనాలు తీసుకొంటున్నారో వివరించాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. లక్షల కోట్ల బడ్జెట్, అప్పులు కలిగిన ప్రభుత్వం సొంతంగా వాహనాలు సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉందా అనే సందేహాలు నెలకొంటున్నాయని అన్నారు. ఒంగోలు ఘటనలో ఒక సహాయ అధికారిని, ఒక హోమ్ గార్డుని సస్పెండ్ చేసేసి విషయాన్ని మరుగునపెట్టేద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉంది. ట్రావెల్ ఆపరేటర్స్ నుంచి అద్దెకు తీసుకోకుండా ప్రయాణీకులను నడిరోడ్డుపై వదిలి వాహనాన్ని తీసుకోవాల్సిన ఒత్తిడితో కూడిన పరిస్థితి ఆ ఉద్యోగులకు ఎందుకు కలిగిందో విచారించాలి.

సదరు ఉద్యోగులపై ఆ స్థాయి ఒత్తిడిని రాజకీయ నాయకులు తీసుకువచ్చారా? ఉన్నతాధికారులు తీసుకువచ్చారా అనేది ముఖ్యం. పాలన వ్యవస్థలో భాగమైన ఆ ఉద్యోగులు ఎవరి ఒత్తిడితో, ఎవరి వినియోగం కోసం బలవంతంగా వాహనాలు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారో వెల్లడి కావాలి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఏటా ముఖ్యమంత్రి భద్రతకు ఎంత ఖర్చు చేస్తున్నారు? వాహన శ్రేణిలో ఉండే వాహనాలు ఎన్ని? ముఖ్యమంత్రి పర్యటనలకు ప్రైవేట్ వాహనాలు ఎందుకు స్వాధీనం చేసుకొంటున్నారు? ప్రైవేట్ వాహనాల్లో ఎవరు పర్యటనలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఒంగోలు ఘటనపై శాఖపరమైన విచారణ చేయాలని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • convoy issue
  • hard comments
  • Pawan Kalyan

Related News

Pawan Prakash Raj

ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. షూటింగ్స్ వంటి వృత్తిపరమైన బాధ్యతల్లో ఎంత బిజీగా ఉన్నా, తన తల్లితో గడిపే సమయానికి ప్రకాష్ రాజ్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు

  • Pawan Speech Assembly

    AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్

  • Bari Opening

    Pawan Kalyan : నిహారిక – వరుణ్ తేజ్ లకు పవన్ సపోర్ట్ ..ఓపెనింగ్ తోనే హైప్ తెచ్చుకున్న ‘బరి’

  • Pawan Kalyan Election Campa

    Pawan Kalyan Election Campaign : తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

  • Pawan Kalyan Ustaad Bhagat

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం !!

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd