Pawan Kalyan Birthday : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. జనసేన చేయబోయే కార్యక్రమాలు ఇవే..
తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
- Author : News Desk
Date : 01-09-2023 - 6:23 IST
Published By : Hashtagu Telugu Desk
సెప్టెంబర్ 2న రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(Pawan Kalyan Birthday) కావడంతో ఇప్పటికే ఆయన అభిమానులు హడావిడి మొదలుపెట్టారు. సినిమాల పరంగా పవన్ నుంచి రాబోయే సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక మరోవైపు జనసేన(Janasena) కార్యకర్తలు కూడా తమ జనసేనాని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. పవన్ పుట్టిన రోజు నాడు పార్టీ తరపున చేయబోయే కార్యక్రమాల గురించి తెలిపారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నాం. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో బ్లడ్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులతో సహ బంతి భోజనాలు ఏర్పాటు చేశాం. రెల్లి కాలనీలో సందర్శన, జన్మదిన కార్యక్రమాలు జరుగుతాయి. బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు ఉచిత పుస్తకాలు,పెన్నులు పంపిణీ చేస్తున్నాం. అధికార పార్టీ నుండి లబ్ది పొందని వికలాంగులకు ప్రోత్సహిస్తూ చేయూత అందిస్తాం. అభిమానులు అందరూ మెగా రక్త దాన శిబిరంలో పాల్గొనాలి అని తెలిపారు.