Nadendla Manohar : వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన స్వాగతిస్తుంది.. బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను సంప్రదించారు..
మరోసారి ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు నినాదం బీజేపీ తీసుకొచ్చింది. త్వరలో పార్లమెంటు అత్యవసర సమావేశాలు ఉంటాయని, దీనికోసమే ఆ సమావేశాలు అని చర్చ జరుగుతుంది.
- By News Desk Published Date - 05:30 PM, Fri - 1 September 23

ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు(One Nation-One Election) అనే నినాదం బీజేపీ(BJP) పార్టీ ఎప్పట్నుంచో చేస్తుంది. దీనికి పలు పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. దేశమంతటా ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. దీనికి ఖర్చు భారీగా అవుతుంది. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడానికి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు.
కొన్ని ప్రతిపక్ష పార్టీలకు దీనివల్ల నష్టం చేకూరుతుందని గతంలో వ్యతిరేకించాయి. ఇప్పుడు మరోసారి ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు నినాదం బీజేపీ తీసుకొచ్చింది. త్వరలో పార్లమెంటు అత్యవసర సమావేశాలు ఉంటాయని, దీనికోసమే ఆ సమావేశాలు అని చర్చ జరుగుతుంది. దీంతో ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తుంటే కొన్ని పార్టీలు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు.
తాజాగా దీనిపై జనసేన(Janasena) నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) కామెంట్స్ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న ఉండటంతో ఆ రోజు కార్యక్రమాల గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు గురించి ప్రస్తావిస్తూ.. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ను జనసేన పార్టీ స్వాగతిస్తుంది. దీనికోసం బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను సంప్రదించారు. దేశానికి అనవసరమైన ఖర్చులు తగ్గించడం ఒక మంచి పరిణామం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉంటుంది అని తెలిపారు. మరి వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, ఎన్ని పార్టీలు మద్దతు ఇస్తాయో చూడాలి.
Also Read : INDIA Meeting : కన్వీనర్ ను తేల్చలేని ఇండియా! ఉమ్మడి కార్యాచరణకు కమిటీ!!