Pawan CM : పవన్ కు సీఎం అభ్యర్థి ఎర వేస్తోన్న బీజేపీ
ఏపీ రాజకీయాలపై బీజేపీ సరికొత్త (Pawan CM)గేమాడుతోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి సిద్దమవుతోంది.
- By CS Rao Published Date - 04:03 PM, Fri - 28 July 23

ఏపీ రాజకీయాలపై బీజేపీ సరికొత్త (Pawan CM)గేమాడుతోంది. రాబోవు రోజుల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి సిద్దమవుతోంది. ఆ రెండు పార్టీల మధ్య ఢిల్లీ స్థాయి పొత్తు ఉందని పవన్ చెబుతుంటారు. కానీ, ఏపీలో మాత్రం ఇప్పటి వరకు కలిసి పనిచేసిన దాఖలు పెద్దగా లేవు. ఉప ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ డిపాజిట్లు ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థికి రాలేదు. ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా పవన్ కల్యాణ్ పక్కకు వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారని తెలుస్తోంది.
ఏపీ రాజకీయాలపై బీజేపీ సరికొత్త గేమాడుతోంది (Pawan CM)
బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి కూడా జనసేన పార్టీతో పొత్తు (Pawan CM) ఉందని చెబుతున్నారు. రెండు పార్టీ ఉమ్మడి సీఎం అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుందని వివరిస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఎన్డీయే సమావేశానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఆయన నడుచుకుంటున్నారు. సీఎం రేస్ లో లేనంటూ కొన్ని రోజుల క్రితం ఆయన చెప్పారు. దీంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖాయమయిందని అందరూ భావించారు. కానీ, ఆ తరువాత వారం రోజులకు సీఎంగా పదవి ఇస్తే సంతోషంగా తీసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు సీఎం గా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండని కోరుకుంటున్నారు. అంటే, ఆయన ఆలోచన సరళి బీజేపీకి అనుకూలంగా మారిపోతుందని స్పష్టంగా తెలుస్తోంది.
సింగిల్ గా వెళ్లడానికి మాత్రం ఆ పార్టీ చీఫ్ పవన్ సిద్ధంగా లేరని
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికుండా చేస్తానంటూ జనసేన పార్టీని వ్యూహాత్మకంగా బలోపేతం చేసుకుంటూ పవన్ వస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి 11 శాతం ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ క్యాడర్ విశ్వసిప్తోంది. కొందరు 25శాతం ఓటు శాతం ఉందని ఊదరగొడుతున్నారు. సింగిల్ గా వెళ్లడానికి మాత్రం ఆ పార్టీ చీఫ్ పవన్ సిద్ధంగా లేరని పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా బోధపడుతోంది. అలాగని, బీజేపీతో వెళితే ఏపీ ప్రజలు తిరస్కరిస్తారన్న భయమూ (Pawan CM) జనసైన్యానికి ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి గుర్తింపు రాకపోతే రాజకీయంగా వీరమరణం పొందినట్టే అవుతుందని పవన్ భావిస్తున్నారు. ఆ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
Also Read : CBN Hitech Publicity : LED వాహనాలతో పల్లెకు చంద్రబాబు ప్రజెంటేషన్లు
ఏపీ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీని వదులుకునేందుకు పవన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా ఆ విషయాన్ని గ్రహించారట. అందుకే, సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి ముందుకొస్తున్నారని తెలుస్తోంది. ఇదంతా ఏపీ రాజకీయ ఆటలో భాగంగా బీజేపీ వేస్తోన్న పాచికగా జనసేన్యం భావిస్తోంది. వాస్తవంగా టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ రావాలని పవన్ కోరిక. కానీ, బీజేపీ ఢిల్లీ పెద్దలు మైండ్ గేమ్ ఆడుతూ (Pawan CM) టీడీపీని దూరంగా పెట్టినట్టు నటిస్తోంది. కానీ, అంతరంగంలో మాత్రం టీడీపీని వదులుకుంటే క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుంది? అనేది ఆ పార్టీకి తెలుసు. అందుకే, సీట్ల సర్దుబాటు సందర్భంగా డిమాండ్ చేయడానికి మాత్రమే బీజేపీ స్ట్రాటజీ ప్లే చేస్తోంది.
Also Read : TDP Scheme : మగువకు `మహాశక్తి` చంద్రబాబు
ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా ఢిల్లీ బీజేపీ ఉంది. ఆ విషయం పవన్ కల్యాణ్ కు బాగా తెలుసు. అందుకే, బీజేపీ వదులుకోవడానికి సిద్దపడుతున్నారు. పైగా ఆ పార్టీ కారణంగా ఏపీలో పెద్దగా సానుకూలత ఉండే ఛాన్స్ లేదు. ఒక వేళ టీడీపీని వదులుకుంటే రాజకీయ వీరమరణం తప్పదని భావిస్తూ దూకుడుగా వెళతాడని ముందురకాళ్లకు బంధంలా సీఎం అభ్యర్థి అంటూ సరికొత్త గేమ్ బీజేపీ మొదలు పెట్టింది. దానికి పవన్ పడతారా? లేదా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోని హాట్ టాపిక్.