HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Checked The News With Only One Interview

Pawan Interview: ఒకే ఒక్క ఇంట‌ర్వ్యూతో ఆ వార్త‌లకు చెక్ పెట్టిన ప‌వ‌న్‌..?

ఈ స‌మ‌యంలోనే ఒక త‌మిళ యూట్యూబ్ చానెల్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సుమారు రెండు గంట‌ల‌పాటు ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించింది. అయితే ఈ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మిళ్ మాట్లాడటంతో యాంకర్ సైతం ఆశ్చ‌ర్య‌పోయారు.

  • Author : Gopi Date : 02-10-2024 - 4:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KA Paul- Pawan Kalyan
KA Paul- Pawan Kalyan

Pawan Interview: తిరుమ‌ల లడ్డూ వ్య‌వ‌హారం ప్ర‌పంచవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే. తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వాడార‌ని సీఎం చంద్ర‌బాబు చేసిన ఆరోప‌ణ‌ల త‌ర్వాత ఈ విష‌యం దేశంలోని రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు సెలెబ్రిటీల‌కు సైతం త‌గిలింది. ల‌డ్డూ వ్య‌వ‌హారంపై ఎవ‌రీ అభిప్రాయాల‌ను వారు మీడియా ముఖంగా తెలియ‌జేశారు. అయితే ల‌డ్డూ వివాదంలో త‌మిళ న‌టుడు కార్తీ చేసిన వ్యాఖ్య‌లు వారం రోజుల క్రితం హాట్ టాపిక్ గా మారిన విష‌యం తెలిసిందే. స‌త్యం సుంద‌రం ప్రీ రిలీజ్ ఈవెంట్ యాంక‌ర్ ఓ మీమ్ చూప‌గా హీరో కార్తీ ఇప్పుడు ల‌డ్డూ టాపిక్ వ‌ద్దు.. చాలా సెన్సిటివ్ అన్నారు. అయితే ఈ కామెంట్స్‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Interview) ల‌డ్డూ పై కామెంట్స్ చేస్తే మ‌ర్యాద‌గా ఉండ‌ద‌ని, సినిమా వాళ్లంటే గౌర‌వ‌మే కానీ స‌నాత‌న ధ‌ర్మాన్ని అవ‌మానిస్తే స‌హించేది లేద‌ని కార్తీని హెచ్చరించారు.

అయితే ఈ విష‌యం తెలుసుకున్న కార్తీ సారీ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు.. నేను ఆ మాట‌లు అన్న‌ది వేరే ఉద్దేశంతో అన్నాను. నా మాట‌ల పట్ల మీరు ఇబ్బంది ప‌డినందుకు సారీ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా కార్తీ సోద‌రుడు సూర్య సైతం నా త‌మ్ముడు కార్తీ వ్యాఖ్య‌ల ప‌ట్ల నేను కూడా సారీ అడుగుతున్నా. అంతేకాకుండా3 రోజుల పాటు ప్రాయ‌శ్చిత్త దీక్ష తీసుకుంటాను అని ట్వీట్ చేశారు. అయితే త‌న త‌ప్పు తెలుసుకున్న ప‌వ‌న్ వెంట‌నే స్పందించి హీరో కార్తీ, సూర్య స్పందించిన తీరుకు ధ‌న్య‌వాదాలు. మీరు కావాల‌ని అన‌లేద‌ని నాకు అర్థ‌మ‌వుతోంది. మీ స‌త్యం సుంద‌రం మూవీ సూప‌ర్ హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుతున్నాను అని సారీ చెప్ప‌కుండా చెప్పిన‌ట్లే ట్వీట్ పెట్టారు. దీంతో ఆ వివాదం అక్క‌డితో క్లోజ్ అయింది.

Also Read: Thaman : రామ్ చరణ్ ఫ్యాన్ రిక్వెస్ట్.. అడ్రెస్ పెట్టు కొని పంపిస్తా తమన్ ట్వీట్..

ఈ స‌మ‌యంలోనే ఒక త‌మిళ యూట్యూబ్ చానెల్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సుమారు రెండు గంట‌ల‌పాటు ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించింది. అయితే ఈ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మిళ్ మాట్లాడటంతో యాంకర్ సైతం ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ స‌నాత‌న ధ‌ర్మం గురించి కూడా త‌మిళంలో ప్ర‌స్తావించారు. ఇప్పుడు ఈ ఇంట‌ర్వ్యూ త‌మిళంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది. ఈ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ మాట్లాడిన తీరు, స‌నాత‌న ధ‌ర్మం ప‌ట్ల మాట‌ల‌ను త‌మిళ ప్ర‌జ‌లు ప్ర‌శంసిస్తున్నారు. అయితే కార్తీని క్ష‌మాప‌ణ చెప్పించ‌డంతో కొంద‌రు త‌మిళ అభిమానులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సోష‌ల్ మీడియా వేదికగా విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇంట‌ర్వ్యూ వైర‌ల్ కావ‌డంతో వారు కాకుండా ప‌వ‌న్ ను త‌ప్పుగా అర్థం చేసుకున్నట్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో ప‌వ‌న్ ఒక ఇంట‌ర్వ్యూతో త‌నపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన‌ట్లు అయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Deputy CM Pawan
  • Hero Karthi
  • Laddu Issue
  • Pawan Kalyan
  • tollywood
  • ttd laddu
  • Viral Interview

Related News

Pawan Praises Modi's Leader

Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

"పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యవంతులు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. తీరిక లేని షెడ్యూల్‌లో కూడా తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపినందుకు ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • Pawan Kalyan Surgery

    Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

  • Pawan Soundarya

    Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

  • Og2

    Pawan Kalyan OG 2 : OG 2 కు పవన్ కళ్యాణ్ నిర్మాత ?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd