HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Our Goal Is The Welfare Of The Poor Cm Chandrababu

CM Chandrababu : పేదల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

పింఛన్లు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటింటికీ వెళ్లి అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెద్దల దీవెనలతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చి వెంటనే పింఛను మొత్తాన్ని పెంచాం.

  • Author : Latha Suma Date : 31-05-2025 - 3:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Our goal is the welfare of the poor: CM Chandrababu
Our goal is the welfare of the poor: CM Chandrababu

CM Chandrababu : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని చెయ్యేరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పేదలకు సేవ చేయడంలో కలిగే ఆనందం మరెక్కడా లభించదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో ఇది ప్రధానమైనదని తెలిపారు. ప్రజావేదికలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పింఛన్లు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటింటికీ వెళ్లి అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెద్దల దీవెనలతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చి వెంటనే పింఛను మొత్తాన్ని పెంచాం. పింఛన్ల పునాది ఏనాడో ఎన్టీఆర్ వేయగా, నేడు అదే పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తున్నాం. ప్రతి లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి పింఛను అందించేందుకు చర్యలు తీసుకున్నాం. ఎక్కడ ఉన్నా వారు వేచి ఉండాల్సిన అవసరం లేదు అని ఆయన వివరించారు.

Read Also:PM Modi : ‘ఆపరేషన్ సిందూర్’లో నారీశక్తి వికాసం: ప్రధాని మోడీ 

ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక పింఛన్లు అందించే రాష్ట్రంగా నిలిచిందని, ఇది తమ ప్రభుత్వం పేదల పట్ల తీసుకుంటున్న విధానానికి నిదర్శనమని సీఎం అన్నారు. మా ప్రభుత్వం పేదల పట్ల నిబద్ధత కలిగి ఉంది. ఉచితంగా మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఇవ్వడమే కాక, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యను బలోపేతం చేస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి మూడుపూటలు అన్నం పెట్టాలన్న సంకల్పంతో ముందుకుసాగుతున్నాం అని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా పేదల కోసం పనిచేయాలన్నదే తమ దృఢ సంకల్పమని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామానికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వారికీ నేరుగా సమస్యలు అర్థమవుతాయని చెప్పారు.

పింఛన్లు ఇవ్వడమే కాకుండా, ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని అందించాలన్నదే మా లక్ష్యం. చేప ఇవ్వడమే కాదు, పట్టిచ్చే మార్గాన్ని చూపించాలన్నదే మా విధానం. భర్త చనిపోతే, ఆటోమేటిక్‌గా భార్యకు పింఛను అందే విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. అంతేకాక, మూడు నెలల వరకు పింఛను తీసుకునే అవకాశం కల్పించాం. భార్య అనాథగా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని సీఎం వివరించారు. చివరగా చంద్రబాబు పేదల సంక్షేమం పట్ల మేము పూర్తి నిబద్ధతతో ఉన్నాం. ఈ రాష్ట్రం పేదల పాలనను ఆస్వాదిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ప్రతి ఒక్కరూ ఈ సంకల్పంలో భాగస్వాములవ్వాలి అని స్పష్టం చేశారు.

Read Also: Suryakumar Yadav: ముంబై ఇండియ‌న్స్‌కు షాక్.. సూర్య‌కుమార్ యాద‌వ్‌కు గాయం?!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ambedkar konaseema district
  • CM Chandrababu
  • ntr
  • pensions Distribution

Related News

    Latest News

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే!

    Trending News

      • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

      • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

      • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

      • భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!

      • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd