HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >On The Great Indian Textile Trail Andhra Pradesh Edition

మంగళగిరి నుంచి కలంకారి వరకు ఏపీలో ఎక్కడ దొరుకుతాయో తెలుసా?

  • Author : Hashtag U Date : 27-10-2021 - 11:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

కొన్నేళ్లుగా ఫ్యాషన్ కల్చర్ రూట్ మార్చుకుంది. చేనేత, దేశీయ వస్త్రాలపై యువతకే కాదు సెలబ్రెటీలు సైతం మోజు పెంచుకుంటున్నారు. అందుకేనేమో మార్కెట్స్ లోనూ ఇలాంటి బట్టల హవానే నడుస్తుంది. అయితే ఏపీలో మంగళగిరి నుంచి కలంకారీ వరకూ ఏవి ఎక్కడ దొరుకుతాయోనని చాలామందికి తెలియదు. టూరిస్ట్ లకు కూడా ఆ ప్రత్యేకతలున్న ప్రాంతాలు చాలామందికి అసలు తెలీదు.

పెడన కలంకారి 
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఉన్న పెడన జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నుండి 10 కి.మీ, అదే రోడ్డు మార్గంలో విజయవాడ నుండి 2.5 గంటల దూరంలో ఉంది. మీరు ఈ చిన్న పల్లెటూరులోకి ప్రవేశించిన వెంటనే, ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత ఏమిటో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇంటి ముందు అడ్డుగా కలంకారీ గుడ్డ తెర ఉంటుంది. అప్పుడే అక్కడ స్పెషాలిటీ అర్థమయిపోతుంది.

క్లాత్ పై డిజైన్ కూరగాయల రంగులతో ముద్రించడం కలంకారీ గుర్తింపు పొందింది. ఈ రంగులు తప్పనిసరిగా ప్రాథమిక రంగులలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎరుపు, నలుపు నీలం రంగులు మాత్రమే ఉండేవివ. అయితే, ఇప్పుడు వీటికి మరిన్ని రంగులు యాడ్ అవుతున్నాయి. క్లాత్ ను ముందుగా కలర్ ఉడకబెట్టి ఎండలో ఆరబెడతారు.తర్వాత బ్లాక్ ప్రింటింగ్ వేస్తారు. పువ్వులు, ఆకులు మొదలైన వాటితో వాటిని చక్కగా డిజైన్ చేస్తారు.

ఎక్కడ కొనాలి..
పెడన కలంకారి భారతదేశంలో అత్యంత సులభంగా లభించే క్లాత్. అయితే పవర్ లూమ్‌లలో ఉత్పత్తి చేయబడిన నకిలీలకు చెక్ పెట్టాలనుకుంటే మాత్రం పెడన వెళ్లాల్సేందే.

శ్రీ కాళహస్తి కలంకారి..
కలంకారికి శ్రీకాళహస్తి చాలా ఫేమస్. ఇక్కడ తయారుచేసిన కలకంకారీ డిజైన్ సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ హస్తకళాకారులు అందమైన డిజైన్లతో ఆకట్టుకుంటారు. ఎక్కువగా హిందూ పురాణాల నుంచి దేవుళ్లు, ఆ దృశ్యాలను కాటన్, సిల్క్ చీరలు, దుపట్టాలపై చిత్రించడానికి నెలల సమయం తీసుకుంటారు.
ఎక్కడ కొనాలి..
పెడనతో పోల్చితే శ్రీకాళహస్తి కలంకారి దొరకడం చాలా కష్టం. శ్రీకాళహస్తిలో కలంకారి పరిశోధన శిక్షణా కేంద్రంలోదొరుకుతాయి. చిట్టిబాబు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ,చక్రి కలంకారి వంటి దుకాణాలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ఎక్కడైనా, మంగళగిరి వస్త్రంపై అందమైన కలంకారి డిజైన్‌లతో చీరలను విక్రయించే డిల్లీ హాట్‌లో శాశ్వత స్టాల్ ఉంది. సూరజ్‌కుండ్ మేళా శ్రీకాళహస్తి కలకంకారిని అమ్మే కళాకారులతో స్టాల్ నిర్వహిస్తుంది.


మంగళగిరి..
ఏపీలోనిమంగళగిరి కాటన్ చీరలకు చిరునామా. మంగళగిరి గుంటూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం. ఇక్కడ తయారు చేసిన చేనేత చీరలు సన్నటి అంచుతో రెండు రంగులలో వస్తాయి.మొదట్లో ఈ అంచులు గోల్డ్ కలర్ లో ఉన్నా.. ఇప్పుడు చాలా రంగుల్లో వస్తున్నాయి. ఇక్కడ మంగళగిరిలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది. ఇది పొడవైన గోపురాలలో ఒకటి. స్థానికంగా తయారైన మంగళగిరి చీరపై, ఈ గోపురం డిజైన్ సరిహద్దులలో ప్రతిరూపం చేయబడింది. మిగిలిన చీర సాధారణంగా సాదాగా ఉంటుంది. ఈ చీరలను తయారు చేయడానికి నేత కార్మికులు పిట్ లూమ్ టెక్నిక్‌ని వాడతారు.
ఎక్కడ కొనాలి..?
కలంకారి లాగానే మంగళగిరి కూడా అదే స్థాయిలో కాకపోయినా సులభంగా దొరుకుతుంది. మంగళగిరి పట్టణంలో మగ్గంమీద అమ్మే వర్క్‌షాప్‌లు ఉన్నాయి. మంగళగిరిలోని మసీదు రహదారికి దగ్గరలో ఉన్న ధనలక్ష్మి షాప్ .. వీటిని కొనడానికి ఉత్తమమైన స్టాల్స్‌లో ఒకటి. ఆంధ్ర ప్రదేశ్ ఎంపోరియమ్స్, నల్లితో పాటు…దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రసిద్ధ దుకాణాలు, ఢిల్లీలోని డిల్లీ హాట్ వంటి ప్రదేశాలలో ఇవి దొరుకుతాయి. మంగళగిరి చీరలు, డ్రెస్ మెటీరియల్స్ కొనడానికి న్యూ ఢిల్లీలోని ఆంధ్ర భవన్ బాగా ఫేమస్.


ఉప్పాడ, పెద్దాపురం..
ఉప్పాడ, పెద్దాపురం చీరలు చాలా ఫేమస్. ఇక్కడ నేసిన చీరలు ఒక కోణంలో, వారి పరిసరాల అందం, వారి ప్రజల లైఫ్ స్టైల్ కనిపిస్తాయి.ఉప్పాడ, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రెండు చిన్న పట్టణాలు. ఇది అంతులేని కొబ్బరి చెట్లతో, గోదావరి నది యొక్క బ్యాక్ వాటర్‌తో, వివిధ రకాల పచ్చని షేడ్స్‌తో కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ చేనేతలో చీర అందమంతా దాని జరీలోనే ఉంటుంది. జరీని సృష్టించడానికి నేత కార్మికులు బంగారంలో పట్టు దారాన్ని ముంచుతారు.
ఎక్కడ కొనాలి..
ఈ చీరలను కొనడానికి ఉత్తమమైన ప్రదేశం ఈ పట్టణాలలోనే ఉంది. చాలా మంది నేత కార్మికులు తమ ఇళ్లలో ఈ చీరలను తయారు చేసి అమ్మకానికి పెడతారు. వారు ఈ చీరలను తమ ఇళ్ల నుండి నేరుగా హైదరాబాద్‌లో లేదా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాల్లోని పెద్ద దుకాణాల్లో లభించే దానికంటే చాలా తక్కువ ధరకు అమ్ముతారు.

పత్తి, ఖాదీ..
దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం, నెల్లూరు సమీపంలోని చీరాల వెంకటగిరి కాటన్ చీరలకు ప్రసిద్ధి చెందాయి. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ..అత్యుత్తమ ఖాదీ నేయబడిన ప్లేస్ గా ఫేమస్ అయింది. మహాత్మా గాంధీ కూడా ఇక్కడి ఖాదీని ఇష్టపడేవారని చెబుతారు.
ఎక్కడ కొనాలి..
మీరు ఈ చీరలను చాలా వరకు పట్టణాల నుండే కొనొచ్చు. విజయవాడ,విశాఖపట్నం, హైదరాబాద్, ఇతర నగరాల్లోని చాలా షాపులలో వీటిని అమ్ముతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kalamkari
  • mangalagiri pattu
  • special
  • sri kalahasti
  • textile

Related News

srikalahasti brahmotsavam 2026 dates

ఈ నెల 10 నుంచి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Sri Kalahasti Brahmotsavams  ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఈ నెల 10 నుంచి 23 వరకు శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేకంగా ఆహ్వానం అందజేసింది. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ పవన్ కళ్యాణ్‌ను కలిసి అధికారిక ఆహ్వాన పత్రికతో పాటు స్వామి వారి ప్రసాదాలన

    Latest News

    • IT Act: ఈ నెలాఖరులోగా కొత్త ఐటీ రూల్స్

    • యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి తలలు పట్టుకున్న నిర్మాతలు

    • లోక్‌సభలో గందరగోళం.. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!

    • అమెరికా-రష్యా మధ్య ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం.. అణు యుద్ధ భయం!

    • మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..

    Trending News

      • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

      • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

      • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

      • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd