NTR Trust : ఎన్టీఆర్ ట్రస్ట్ కు 28 ఏళ్లు
NTR Trust : సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఏర్పాటుచేసిన ట్రస్టు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ
- By Sudheer Published Date - 12:42 PM, Sat - 15 February 25

ఎన్టీఆర్ ట్రస్టు (NTR Trust or NTR Memorial Trust) ఏర్పాటు చేసి నేటికీ 28 ఏళ్లు అవుతుంది. 1997 సంవత్సరంలో సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహించే ప్రధాన ఉద్దేశంతో స్థాపించబడినది. ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు పేరు మీదుగా ఈ సంస్థ ఏర్పాటు చేయబడినది. దీనికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని నారా చంద్రబాబు నాయుడు సంస్థ కోసం స్థలాన్ని కేటాయించడం ప్రధానంగా నిలిచింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఏర్పాటుచేసిన ట్రస్టు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది. ముఖ్యంగా విద్య, వైద్యం, ప్రకృతి విపత్తుల సందర్భంగా సహాయక చర్యలు, ఎన్టీఆర్ సుజల, రక్తనిధి కేంద్రాలు, సాధికారత, ఉద్యోగ కల్పన, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో సేవలు అందిస్తూ వస్తుంది.
Delhi : ‘శీష్ మహల్’ పై విచారణకు కేంద్రం ఆదేశం
సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి విద్య, వైద్యం, విపత్తు నిర్వహణ, ఉపాధి కల్పన, రక్తదానం వంటి అనేక రంగాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ విశేష సేవలందిస్తోంది. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడంతో పాటు, ఆరోగ్య సంరక్షణలో నాణ్యతను పెంచేందుకు పలు హాస్పిటళ్లలో ఉచిత చికిత్సలు నిర్వహిస్తోంది. విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టి ఎంతోమందికి భరోసానిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ రక్తనిధి కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా రక్తదానం చేయించేందుకు ముందు నిలుస్తున్నాయి. అలాగే, ఎన్టీఆర్ సుజల ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పిస్తోంది. మహిళలు, యువత స్వయం ఉపాధి పొందేలా వివిధ శిక్షణా కార్యక్రమాలు అందిస్తోంది. సమాజం కోసం అహర్నిశలు సేవలందిస్తూ, ఎన్నో జీవితాలను మారుస్తోంది.
నేటితో ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu ) ట్రస్ట్ సిబ్బందికి, నిర్వాహకులకు, దాతలకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, విపత్తు నిర్వహణ & సాయం, సాధికారత & జీవనోపాధి రంగాలలో పేదలకు, ఆపన్నులకు చేయూతనిస్తున్న మీ సేవా స్ఫూర్తి ప్రశంసనీయమన్నారు. ఈ క్రమంలో మహనీయుడు ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తూ… మీ కృషి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.