HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ntr District Collector Delhi Rao Inspect Queue Lines

Durga Temple : సామ‌న్య భ‌క్తుల సేవ‌లో ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌.. దుర్గ‌గుడిలో అడ్డ‌దారిలో ద‌ర్శ‌నాల‌కు చెక్‌

సామాన్య భక్తులకు అమ్మ‌వారి ద‌ర్శ‌నం త్వ‌రగతిన క‌లిగేలా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

  • Author : Prasad Date : 20-10-2023 - 4:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Durga temple
Durga temple

సామాన్య భక్తులకు అమ్మ‌వారి ద‌ర్శ‌నం త్వ‌రగతిన క‌లిగేలా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో భాగంగా గురువారం అర్థ‌రాత్రి ఆయన ఆలయానికి చేరుకున్నారు. కొండ కింది భాగం నుంచి క్యూ లైన్ లో ఉన్న భక్తుల సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కారం కోసం అక్కడే ఉన్న అధికారులను సమాయత్తం చేస్తూ కొండపైకి చేరారు. అనంతరం ఆయన అడ్డదారిలో దర్శనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కొంతమందిని నియంత్రించారు. అంతటితో ఆగకుండా అటువంటి అవకాశాలు ఉన్న మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలకు సిబ్బందితో తాళాలు వేయించారు. ఆ తాళాలు మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రొటోకాల్ ఉన్న వీవీఐపీలకు వీఐపీల‌కు క్యూలైన్ ద్వారా మాత్రమే దర్శనం చేసుకునేలా అక్కడ ఉన్న సిబ్బందిని కఠినంగా ఆదేశించారు. దర్శనాల విషయంలో స్వార్థంతో ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

దేవాలయం లోపల భాగంలో కూడా అన్ని ద్వారాలు దగ్గరుండి మూసేయించారు. అర్ధరాత్రి రెండు గంటలకు దర్శనాలు ప్రారంభం కాగానే ఆయన క్యూలైన్లు పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల రద్దీని క్రమ పద్ధతిలో నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ రూపాలలో సేవలు అందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తల ప్రతినిధులతో మాట్లాడి భక్తుల ఇబ్బందులను తక్షణమే ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. సామాన్య భక్తులకు సులభతరమైన దర్శన భాగ్యం కల్పించేందుకు ఆయన నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తక్షణమే స్పందించేందుకు వినాయకుడి గుడి సమీపం నుంచి కొండపై వరకు నిర్ణయాధికారం కలిగిన సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లతో సహా పోలీసు, రెవెన్యూ, అధికారులను సమన్వయం చేస్తూ వారికి సూచనలు అందించారు. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయం వద్ద ఈవో రామ రావు తో కలసి కలెక్టర్ ఎస్. డిల్లీరావు దీపారాధన చేసి సరస్వతి దేవికి పూజలు చేశారు. జిల్లాలో ప్రతి ఒక్కరు విద్యా బుద్దులు జ్ఞానం, విజ్ఞానాన్ని ప్రసాదించే లా అనుగ్రహించాలని జగన్మాతను వేడుకున్నట్లు కలెక్టర్ డిల్లీ రావు తెలిపారు.

Also Read:  Durga Temple : ఇంద్ర‌కీలాద్రికి పోటెత్తిన భ‌క్తులు.. నేడు దుర్గ‌మ్మ‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించనున్న సీఎం జ‌గ‌న్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • dasara 2023
  • Delhi rao IAS
  • durga temple
  • Indrakeeladri
  • Kanaka Dura Temple

Related News

Ap Logo

Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

ఏపీ ప్రభుత్వం కొత్త ప్రైవేట్ విద్యా సంస్థల ఏర్పాటును సులభతరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా ప్రైవేటు విద్యా సంస్థల చట్టంలో పలు నిబంధనలకు సవరణలు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పస్‌ ఫండ్‌, ఇతర నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల విన్నపాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.15 లక్షల కార్పస్‌ ఫండ్‌ను రద్దు చేశారు.

  • Nara Lokesh: Minister Nara Lokesh on a Visit to Russia to Attract Investments to AP

    Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

Latest News

  • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

  • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

  • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

  • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

  • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd