HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Non Bailable Warrant For Ap Minister Ushasree Charan

AP Minister: మంత్రి ఉషశ్రీ చరణ్‌ కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ఏపీ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

  • Author : Balu J Date : 17-11-2022 - 2:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Usha Sri
Usha Sri

ఏపీ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27న అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అప్పటి తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు 188 సెక్షన్‌ కింద ఆమెతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన విచారణ కళ్యాణదుర్గం కోర్టులో జరిగింది. గైర్హాజరు కావడంతో ఆమెతో పాటు కేసులో ఏడుగురిపై కళ్యాణదుర్గం జూనియర్‌ సివిల్‌ జడ్జి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు.

ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీన మంత్రి ఉషశ్రీ చరణ్ తన అనుచరులను వెంటపెట్టుకొని తిరుమలకు వచ్చారు. అప్పుడు సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నందున టీటీడీ విఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అయినప్పటికీ మంత్రి ఉషశ్రీ చరణ్ టీటీడీ అధికారులపై ఒత్తిడి చేసి 10 మంది అనుచరులకు సుప్రభాత టికెట్లు తీసుకోవడమే కాకుండా మరికొంత మంది అనుచరులకు బ్రేక్ దర్శనాలు కల్పించిన ఘటన కూడా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap minister
  • Usha Sri Charan

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd