HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nidigumta Aruna Latest Update

Nidigumta Aruna : మాయలేడి అరుణ బాగోతాలు తెలిస్తే..వామ్మో అనకుండా ఉండలేరు !!

Niganti Aruna : గూడూరుకు చెందిన రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అయిన ఈమె గతంలో అనేక నేరాలు, సెటిల్మెంట్లలో భాగమైనట్లు పోలీసులు గుర్తించారు

  • Author : Sudheer Date : 20-08-2025 - 7:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arunstory
Arunstory

నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ‘ఖిలాడీ లేడీ’ నిడిగుంట అరుణ(Nidigumta Aruna)ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై నమోదైన పలు చీటింగ్ మరియు హనీట్రాప్ కేసుల విచారణలో భాగంగా పోలీసులు చాలా కాలంగా ఆమె కోసం గాలిస్తున్నారు. మంగళవారం ఆమె కారులో విజయవాడ వైపు వెళ్తుండగా, అద్దంకి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గూడూరుకు చెందిన రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అయిన ఈమె గతంలో అనేక నేరాలు, సెటిల్మెంట్లలో భాగమైనట్లు పోలీసులు గుర్తించారు. కోవూరులో ఒక ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఆమెను అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని ఓ సీఐని బెదిరించిన కేసులో కూడా ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో అరుణతో పాటు మరో ముగ్గురిని నిందితులుగా చేర్చారు. ఆమె చీటింగ్ కేసుల చరిత్ర చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

Sciatica : సయాటిక నొప్పి వేధిస్తుందా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు రిలీఫ్ దొరుకుతుంది

అరుణ అరెస్టుకు కొన్ని రోజుల ముందు, జీవిత ఖైదు పడిన రౌడీషీటర్ శ్రీకాంత్‌తో ఆమె ఆసుపత్రిలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరు ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్ వ్యతిరేకించినప్పటికీ, ఉన్నతాధికారుల ఒత్తిడితో శ్రీకాంత్‌కు పెరోల్ ఇప్పించడంలో అరుణ కీలక పాత్ర పోషించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం శ్రీకాంత్ పెరోల్‌ను రద్దు చేసింది. అప్పటి నుంచి అరుణ కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆమెకు రాజకీయంగా, పోలీసు శాఖలో పలువురి మద్దతు ఉందని వార్తలు వచ్చాయి. దీనిపై ప్రస్తుత హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. పోలీసుల రికార్డుల్లో ఉన్న అరుణపై కఠిన చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన 24 గంటల్లోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు సమయంలో అరుణ తనపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనను అక్రమంగా అరెస్టు చేశారని వాదించారు. పోలీసులు తనపై గంజాయి కేసు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు. పడుగుపాడులోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు విషయంలో యజమానిని లక్ష రూపాయల మేర మోసం చేశారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైంది. అరెస్టు అనంతరం ఆమెను కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బుధవారం మధ్యాహ్నం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. ఈమె వెనుక ఉన్న వారి వివరాలను పోలీసులు రాబట్టే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • Nidigumta Aruna
  • Nidigumta Aruna news
  • srikanth
  • ycp

Related News

Jagan Lotus Pond

YCP Jagan : మళ్లీ లోటస్‌పాండ్ కు జగన్ మకాం ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ మకాంను మళ్లీ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు మార్చబోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సమయాన్ని ఎక్కువగా

    Latest News

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd