HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >New Dgp For Andhra Pradesh State Names Of Those Five Officers Sent To Upsc

New DGP : కొత్త డీజీపీ రేసు.. యూపీఎ‌స్‌సీకి ఐదు పేర్లు.. ప్రయారిటీ ఎవరికి ?

ప్రస్తుతం ఏపీ ఇంఛార్జ్‌ డీజీపీ(New DGP)గా హరీశ్ కుమార్ గుప్తా వ్యవహరిస్తున్నారు.

  • Author : Pasha Date : 22-03-2025 - 10:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap New Dgp Andhra Pradesh Names To Upsc

New DGP : ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రాబోతున్నారు. నూతన డీజీపీ ఎంపికపై ఏపీలోని కూటమి ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)కు పంపింది.  ఈ లిస్టులో మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్ర నాథ్‌రెడ్డి,  హరీశ్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యంల పేర్లు ఉన్నాయి. యూపీఎస్‌సీ వీరిలో ముగ్గురి పేర్లను ఎంపిక చేసి, తిరిగి ఏపీ ప్రభుత్వానికి నివేదిక పంపనుంది. ఆ ముగ్గురిలో నుంచి ఒక అధికారిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించే ఛాన్స్ ఉంది.

Also Read :Mahesh Babu : కూతురితో మహేశ్‌బాబు యాడ్‌పై చర్చ.. ఎందుకు ?

హరీష్ కుమార్ గుప్తాకే అవకాశమా ? 

ప్రస్తుతం ఏపీ ఇంఛార్జ్‌ డీజీపీ(New DGP)గా హరీశ్ కుమార్ గుప్తా వ్యవహరిస్తున్నారు. పూర్తిస్థాయి డీజీపీ నియామాకానికి మొగ్గు చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం,  యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసి రెండేళ్లపాటు కొనసాగించాలని భావిస్తోంది. మెరిట్‌ ప్రకారం హరీశ్ కుమార్‌ గుప్తాకే అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. 2024 మే6న హరీశ్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది.ఈయన  1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2024 మే 5న నాటి ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది.రాజకీయ ఆరోపణల నేపథ్యంలో రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేశారు. ఇప్పుడు యూపీఎస్‌సీకి రాష్ట్ర సర్కారుకు పంపిన లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి పేరు కూడా ఉండటం గమనార్హం. సీనియార్టీపరంగా హరీశ్ కుమార్ గుప్తా తర్వాతి స్థానాల్లో సీతారామాంజనేయులు, కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉన్నారు.హరీష్‌ కుమార్ తర్వాత డీజీపీ రేసులో బాలసుబ్రహ్మణ్యం, కుమార్‌ విశ్వజిత్‌‌లు ఉంటారు.

Also Read :Irfan Pathan : ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్‌ నుంచి ఔట్.. ఇర్ఫాన్‌ కీలక ప్రకటన

అప్పటి నుంచి ఖాళీ.. 

గతంలో డీజీపీగా పనిచేసిన ద్వారకా తిరుమల రావు రిటైరయ్యారు. దీంతో అప్పటి నుంచి పూర్తిస్థాయి డీజీపీ పోస్టు ఖాళీగా ఉంది. యూపీఎస్‌సీ‌లో ఎలాగూ కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రభావం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఏపీలోని కూటమి సర్కారుకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత ఉంది. దాన్ని వినియోగించుకొని తమకు ఇష్టమైన ఐపీఎస్ అధికారిని రాష్ట్ర డీజీపీగా తెచ్చుకునే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP DGP
  • AP New DGP
  • new DGP
  • UPSC

Related News

State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

Elite Eco Energies : ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటూ, ప్రముఖ ఎనర్జీ బ్రాండ్ ‘పూర్‌పవర్’ (PoorPower) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గూనుపూడిలో తన అత్యాధునిక షోరూమ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ (Elite Eco Energies) పేరుతో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ నూతన సదుపాయం కేవలం ఒక సాధారణ రిటైల్ విక్రయ కేంద్రంగానే కాకుండా, దక్షిణ భారతదేశం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

  • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

  • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd