CM Jagan : డిసెంబర్ 18 నుండి ఏపీలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణి
డిసెంబర్ 18 నుండి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.42 కోట్ల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు
- By Sudheer Published Date - 12:10 PM, Tue - 5 December 23

సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు. డిసెంబర్ 18 నుండి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.42 కోట్ల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను (New Aarogyasri Card) పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ మీద విస్తృతంగా, ముమ్మరంగా ప్రచారం చేయాలని జగన్ ఆదేశించారు. ఆరోగ్య శ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలో తెలియని వారు ఉండకూడదని సూచించారు. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యాన్ని అందుకునేవారికి ఈ విషయాలన్నీ తెలియాలని ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందించడంతో పాటు, మందుల కొరత కూడా లేకుండా చూడాలని జగన్ ఆదేశించారు. మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడ రాజీపడొద్దని సీఎం సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి మండలంలో జనవరి 1 నుంచి ప్రతి వారం ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. 2023-24లో నవంబరు నెలాఖరు నాటికి 12.42 లక్షల మంది ఆరోగ్యశ్రీ పదకం కింద ఉచితంగా చికిత్స తీసుకున్నారని, ఇది గత ఏడాది కంటే 24.64 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. చైనాలో విస్తరిస్తున్న హెచ్9ఎన్2 వైరస్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
Read Also : Congress MLAs: మంత్రి పదవీ ప్లీజ్.. క్యాబినెట్ పోస్టులపై టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల లాబీయింగ్!