CM Jagan: నాటా తెలుగు సభలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan)కి ఆహ్వానం పంపింది. జూన్ 30 నుంచి జూలై 2, 2023 వరకు డల్లాస్ లో జరగనున్న తెలుగు మహాసభల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan)ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ఆహ్వానించింది.
- Author : Gopichand
Date : 20-12-2022 - 8:10 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan)కి ఆహ్వానం పంపింది. జూన్ 30 నుంచి జూలై 2, 2023 వరకు డల్లాస్ లో జరగనున్న తెలుగు మహాసభల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan)ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ఆహ్వానించింది. నాటా అధ్యక్షుడు డాక్టర్ కొరసపాటి శ్రీధర్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆయన వెంట ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్‌రెడ్డి భీమిరెడ్డి, నాటా సభ్యులు ఉన్నారు.
సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నాటా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్‌రెడ్డి కొరసపాటి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్‌రెడ్డి భీమిరెడ్డితో పాటు పలువురు నాటా సభ్యులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాము నిర్వహించే మహాసభలకు హాజరు కావాలని సీఎం జగన్‌ను ఆహ్వానించారు. NATA తెలుగు మహాసభ 2023 జూన్ 30 నుండి జూలై 2 వరకు USAలోని డల్లాస్ లో జరగనుంది. డల్హౌసీ కన్వెన్షన్ సెంటర్ ఈ సమావేశాలకు వేదిక కానుంది. మరోవైపు కార్యవర్గాన్ని కలిసిన సీఎం జగన్ పేరు పేరునా పలకరించారు. ఈ సందర్భంగా నాటా సభ్యులు సీఎం జగన్‌ను శాలువా కప్పి సన్మానించారు. తెలుగు మహాసభల ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.
Also Read: Hyderabad : మైనర్ బాలికపై “బీఆర్ఎస్” నేత వేధింపులు