Nara Rohith : దిగ్భ్రాంతిలో ఉన్న వేళ అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు – నారా రోహిత్
Nara Rohit : ముఖ్యంగా ఈ కష్టకాలంలో మాలో ధైర్యాన్ని నింపిన పెదనాన్న (చంద్రబాబు), పెద్దమ్మ(భువనేశ్వరి), లోకేశ్ అన్నయ్య, బ్రాహ్మణి వదినకు ప్రత్యేకంగా ధన్యవాదాలు
- By Sudheer Published Date - 01:47 PM, Mon - 18 November 24

తన తండ్రి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వేళ అండగా నిలిచిన అందరికీ హీరో నారా రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం , టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) సోదరుడు, నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు (Nara Ramamurthy Naidu) శనివారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..హైదరాబాద్ లోని AIG హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ..శనివారం కన్నుమూశారు. రామ్మూర్తి నాయుడు మరణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది.
ఆదివారం నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు తో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, నారా లోకేశ్, బ్రాహ్మణి, సినీ నటులు మోహన్ బాబు, మంచు మనోజ్, పలువురు ప్రజాప్రతినిధులు, లో వేలాదిగా పార్టీ శ్రేణులు , కుటుంబ సభ్యులు , నారా , నందమూరి అభిమానులు , ప్రజలు హాజరయ్యారు.
తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన నారా రోహిత్ ను పెదనాన్న చంద్రబాబు , అన్న లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులు ఓదార్చాడు. తన తండ్రి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వేళ అండగా నిలిచిన అందరికీ నారా రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ముఖ్యంగా ఈ కష్టకాలంలో మాలో ధైర్యాన్ని నింపిన పెదనాన్న (చంద్రబాబు), పెద్దమ్మ(భువనేశ్వరి), లోకేశ్ అన్నయ్య, బ్రాహ్మణి వదినకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు.
Thank You…! pic.twitter.com/jScf7aBUzb
— Rohith Nara (@IamRohithNara) November 18, 2024
Read Also : Sri Lanka : శ్రీలంక ప్రధాన మంత్రిగా హరిణి అమరసూర్య నియామకం