Nara Lokesh: నారా లోకేష్ అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్.. రాష్ట్రానికి తరలివస్తున్నా పరిశ్రమలు..
గూగుల్ ఆంధ్రప్రదేశ్‌తో కీలక భాగస్వామిగా ఉంటామని ప్రకటించింది. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకున్న గూగుల్, రాష్ట్రానికి కృత్రిమ మేధ (ఏఐ) సేవలు అందించేందుకు సమగ్ర ప్రణాళికలు వెల్లడించింది. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో గూగుల్ బృందం సమావేశమైంది. ‘‘ఐటీ రంగాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం’’ అని చంద్రబాబు చెప్పారు.
- By Kode Mohan Sai Published Date - 11:40 AM, Thu - 12 December 24

ప్రఖ్యాత ఐటీ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌తో కీలక భాగస్వామిగా ఉంటామని ప్రకటించింది. రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) సేవలు అందించడానికి మరియు విశాఖపట్నంలో గూగుల్ కేంద్రం ఏర్పాటు చేయడానికి గూగుల్ రాష్ట్ర ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన సమావేశంలో, గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జీజీఏఐ) వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే నేతృత్వంలోని గూగుల్ బృందం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేసారు.
ఈ సందర్భంగా బికాష్ కోలే మాట్లాడుతూ, గూగుల్ పెట్టుబడుల పరంగా ఏ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నది, అలాగే విశాఖపట్నం సహా రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయడానికి గూగుల్ ఆలోచిస్తున్న ప్రణాళికలను వివరించారు. ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ చేసుకున్న ఒప్పందం, ఆ తర్వాత విశాఖలో వికాస్ పర్యటన గురించి చర్చ జరిగింది.
Delighted to welcome the Google team, led by Sri Bikash Koley, VP, Google Global Networking and Infrastructure, to Amaravati today, alongside Hon'ble Chief Minister @ncbn Garu.
This visit follows the MoU signing on December 5th, strengthening the collaboration between @Google… pic.twitter.com/yCzm0nqQJe
— Lokesh Nara (@naralokesh) December 11, 2024
అమెరికా పర్యటనలో మంత్రి లోకేశ్ గూగుల్ సందర్శన, ఏఐ సేవలపై చర్చలు:
అమెరికా పర్యటనలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించి, రాష్ట్రానికి కృత్రిమ మేధ (ఏఐ) సేవలు అందించాలంటూ ఆహ్వానించారు. గూగుల్ ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించే ఉద్దేశంతో ఉన్నట్లు, త్వరలో ఈ ప్రణాళికలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జీజీఏఐ) వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే తెలిపారు.
ఇటీవలి సమావేశాల్లో, మంత్రి లోకేశ్, ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌తో కలిసి గూగుల్ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత, రాష్ట్రంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కట్టబెట్టుకోవాలని నిర్ణయించినట్లు బికాష్ కోలే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, గూగుల్ విశాఖపట్నంలో కేంద్రం ఏర్పాటు చేయాలనే అంశంపై మంత్రి లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా, రిలయన్స్, నిప్పాన్ స్టీల్స్, భారత్ ఫోర్బ్స్, టాటా గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడంపై కూడా చర్చ జరిగింది.
Visited the @Google campus in San Francisco, where I met with @googlecloud CEO, Mr Thomas Kurian. We discussed cloud infrastructure, with a focus on establishing data centres in Vizag. During my visit, I also highlighted GoAP's commitment to enhancing citizen services with… pic.twitter.com/xmXma0uJSl
— Lokesh Nara (@naralokesh) October 31, 2024
భారతదేశంలో తమ సంస్థ వ్యాపార కార్యకలాపాలపై గూగుల్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించింది. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ రంగం ఆర్థిక, సామాజికంగా అమితమైన ప్రభావం చూపే శక్తిని కలిగి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక, సామాజికాభివృద్ధిలో ఐటీ రంగం కీలకమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని విస్తరించడంతో దాని ద్వారా వచ్చే ప్రయోజనాలను అర్థం చేసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుంది’’ అని ఆయన భరోసా ఇచ్చారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఐటీ రంగంపై దృష్టి పెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఐటీ అత్యంత ప్రభావశీలిగా మారిందని చంద్రబాబు చెప్పారు.