Nara Lokesh : నేడు విజయవాడకు నారా లోకేష్.. రేపు చంద్రబాబుతో ములాఖత్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత గత 20 రోజులుగా ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ ఈ రోజు విజయవాడకు రానున్నారు.
- Author : Prasad
Date : 05-10-2023 - 9:07 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత గత 20 రోజులుగా ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ ఈ రోజు విజయవాడకు రానున్నారు. రేపు రాజమండ్రి వెళ్లి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. వాస్తవానికి ఈ వారంలో సీఐడీ విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా సీఐడీ ఆయన్ని చేర్చింది. దీంతో ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు లోకేష్‌కి నోటీసులు ఇచ్చారు. అయితే దీనిని లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు 10 తేదీ వరకు లోకేష్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీకి సూచించింది. దీంతో లోకేష్‌కు కాస్త ఊరట లభించింది.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు గత 27 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు.. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 17ఏపై చంద్రబాబు తరుపున న్యాయవాదులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఈ క్వాష్ పిటిషన్‌పై చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇటు ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు కూడా విచారణ జరగనుంది. సీఐడీ తరుపు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు జడ్జి పలు ప్రశ్నలు సంధించారు. ఈ రోజు కూడా ఆధారాలు చూపించకపోతే చంద్రబాబు కస్టడీ పిటిషన్ కొట్టేసి.. బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.ఈ 25 రోజుల నుంచి నారా లోకేష్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో కేసు విషయాలను చర్చించారు. కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండటంతో లోకేష్ విజయవాడకు చేరుకుంటున్నారు.
Also Read: NTR Silent: ఎన్టీఆర్ మౌనంపై బాలయ్య రియాక్షన్.. ఐ డోంట్ కేర్