3 Years Of YSRCP : మూడేళ్ల పాలనపై లోకేష్ మూడు మాటల్లో…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన తీరును లోకేష్ మూడు మాటల్లో చెప్పేశారు.
- Author : CS Rao
Date : 30-05-2022 - 2:19 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన తీరును లోకేష్ మూడు మాటల్లో చెప్పేశారు. మూడేళ్ల జగన్ పాలన విద్వేషం, విధ్వసం, విషాదం అంటూ వర్ణించారు. ఈ మూడేళ్లలో ఆయన సాధించింది శూన్యమని చెప్పారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయమని జ్యోషం చెప్పారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
జగన్ రెడ్డి గారి మూడేళ్ల పాలన మూడు మాటల్లో.. విద్వేషం..విధ్వంసం..విషాదం. మూడేళ్లలో సాధించింది శూన్యం.. రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనం ఖాయం.#3YearsForFailedCMJagan pic.twitter.com/L5TSK7Wl2y
— Lokesh Nara (@naralokesh) May 30, 2022
విద్వేషానికి సంబంధించి రామతీర్థంలో రాముని తల నరికివేతను, విధ్వంసానికి సంబంధించి ప్రజావేదిక కూల్చివేతను, విషాదానికి సంబంధించి ఎల్జీ పాలిమర్స్ విషాద ఘటనను ఆయన కోడ్ చేశారు. ఏపీలో వైసీపీ అధికారాన్ని చేపట్టి నేటికి మూడేళ్లయింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. జగన్ ట్వీట్లతో కార్యకర్తలను ఉత్సాహం పరిచారు. మరోవైపు, జగన్ మూడేళ్ల పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. విపక్ష నేతలు కూడా జగన్ పాలనపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా లోకేష్ ట్వీట్లతో జగన్ పాలన పై ధ్వజమెత్తారు.