HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh To Appear In Visakhapatnam Court Today

Nara Lokesh: నేడు విశాఖ కోర్టుకు నారా లోకేష్

  • Author : Vamsi Chowdary Korata Date : 18-10-2024 - 10:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh In Visakha
Nara Lokesh In Visakha

Nara Lokesh: ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు. ఆయన ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకొని, పార్టీ కార్యాలయంలో బస చేస్తున్నారు. “చినబాబు చిరుతిండి ఖర్చు.. 25 లక్షలండి” పేరుతో సాక్షి పత్రికలో ప్రచురించిన అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరగనుంది. 2019లో సాక్షి పత్రికలో “చినబాబు చిరుతిండి ఖర్చు.. రూ. 25 లక్షలండి” అనే టైటిల్‌తో ప్రచురించిన కథనం అసత్యాలు మరియు కల్పితాలతో నిండి ఉందని, ఈ కథనం తనకు అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో రూపొందించబడిందని లోకేష్ అప్పట్లో తెలిపారు.

నారా లోకేష్ పరువునష్టం దావా:

సాక్షి పత్రిక వివరణ ఇవ్వకుండా, నోటీసులకు స్పందించకపోవడంతో నారా లోకేష్ పరువునష్టం దావా దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌లో, తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని తెలిపారు. ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో లేనని, ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదలకు సంబంధించిన ఖర్చును తనకు అంటగడుతూ తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారన్నది ఆయన కోర్టుకు అందించిన ఆరోపణ. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినప్పటికీ, ఎయిర్ పోర్ట్‌లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు అందుకోలేదని లోకేష్ స్పష్టం చేశారు.

వాస్తవానికి, వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయంలో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్‌ టేకాఫ్‌కు సమయం ఉన్నప్పుడు వీఐపీ లాంజ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఇది సర్వసాధారణమైన అంశం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, నారా లోకేష్ విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు టీ, కాఫీ, స్నాక్స్‌ కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారనే నిరాధార కథనాన్ని సాక్షి పత్రిక ప్రచురించింది.

ఈ కథనంపై నారా లోకేష్ అప్పట్లోనే తీవ్రంగా మండిపడ్డారు. సాక్షి నీతి లేని కథనాలను ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు, కానీ సాక్షి స్పందించలేదు. అందుకే, సాక్షిపై 75 కోట్ల రూపాయల పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణ జరగుతున్న నేపథ్యంలో, ఈరోజు లోకేష్ కోర్టుకు హాజరుకానున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • nara lokesh
  • Nara Lokesh Defamation Suit
  • Nara Lokesh In Visakha
  • sakshi tv
  • Visakha Court

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

Latest News

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd