HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Skill Portal For Overseas Employment Launch Soon

Nara Lokesh : నైపుణ్యం పోర్టల్‌ను ఆగస్టు నాటికి పూర్తి.. అధికారులకు లోకేశ్ హుకుం

Nara Lokesh : విదేశాల్లో ఉపాధి అవకాశాలను అన్వేషిస్తున్న తెలుగు యువతకు మార్గదర్శనంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.

  • Author : Kavya Krishna Date : 16-07-2025 - 12:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh : విదేశాల్లో ఉపాధి అవకాశాలను అన్వేషిస్తున్న తెలుగు యువతకు మార్గదర్శనంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. యువతకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తూ, విదేశీ ఉపాధికి దారితీసే నైపుణ్య పోర్టల్ను రూపొందించేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ పోర్టల్‌ను వచ్చే ఆగస్టు లోగా పూర్తిచేయాలని, సెప్టెంబర్ 1న అధికారికంగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో అమరావతి సమీపంలోని ఉండవల్లిలో తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. పోర్టల్ రూపకల్పన, శిక్షణా మాడ్యూళ్ల తయారీ, కౌన్సిలింగ్ సేవల కల్పనపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

Aerospace Park : కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ కోసం భూసేకరణ రద్దు..ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అవకాశాలు!

లోకేశ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పోర్టల్ ద్వారా యువతకు అవసరమైన శిక్షణలతో పాటు, విదేశాల్లో నైపుణ్యాధారిత ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధ సంస్థ అయిన ఓంక్యాప్ (OMCAP) ద్వారా కల్పించనున్నారు. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు మార్గదర్శకాలను రూపొందించాలని లోకేశ్ స్పష్టం చేశారు.

అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే సహాయం పొందేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ నెంబర్ 0863-2340678, వాట్సాప్ నెంబర్ 85000 27678లను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే, ఇటీవల థాయ్‌లాండ్‌లో ఉద్యోగాల పేరుతో మోసపోయిన యువతను స్వదేశానికి రప్పించేందుకు ఓంక్యాప్, ఎన్ఆర్‌టీ (NRT)ల సహకారంతో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు విదేశీ ఉపాధి కోరుకునే తెలుగు యువతకు భరోసానిచ్చేలా ఉంటాయని, భవిష్యత్తులో ఈ పోర్టల్ వారి ప్రయాణంలో మార్గదర్శిగా నిలుస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.

Minister Komatireddy : దసరా నాటికి ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • AP NRT
  • Foreign Job Assistance
  • nara lokesh
  • OMCAP
  • Overseas Jobs
  • Skill Development
  • Skill Portal
  • Telugu Youth Opportunities
  • Youth Employment

Related News

Andhra Pradesh Logo

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

Andhrapradesh Govt  ఏపీ ప్రభుత్వం ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించిన హెచ్ఆర్ పాలసీ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పీఏసీఎస్‌‌కు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించింది. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ సంబంధిత సమస్యల్ని ఈ కమిటీ పరిశీలించి తగిన సూచనలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పీఏసీఎస్‌

  • Vaali Lokesh

    Medaram Jathara Kova Bun Controversy : కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ భరోసా !!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd