YCP : జగన్ లో కొత్త అనుమానం రేకెత్తించిన నారా లోకేష్
YCP : ఇది వైసీపీలో ఒక విపరీత వర్గం ఉన్నదనే సందేహాన్ని పెంచుతోందని తెలిపారు. ఈ పరిణామం అధికార వైసీపీ శిబిరంలో కలకలం రేపుతోంది
- By Sudheer Published Date - 09:32 PM, Fri - 4 April 25

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Jagan) పార్టీపై తన పట్టును కోల్పోతున్నారా? అనే అనుమానాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Lokesh) రేకెత్తించారు. ఇటీవల వక్ఫ్ చట్ట సవరణ బిల్లు (Waqf Bill)కి సంబంధించి పార్లమెంట్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించిన లోకేశ్, వైసీపీలో జగన్‌ను వ్యతిరేకించే వర్గం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ ఆదేశాలను పాటించకుండా ఓ వైసీపీ ఎంపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం వైసీపీలో అంతర్గత విభేదాలు ఉందన్న సంకేతాలివ్వడమని ఆయన అన్నారు.
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంలో సవాల్ చేసిన కాంగ్రెస్, ఎంఐఎం.. ఏం జరగబోతుంది..?
వక్ఫ్ చట్ట సవరణ బిల్లును టీడీపీ విస్తృతంగా పరిశీలించాలంటూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని డిమాండ్ చేసింది. అయితే వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించాలంటూ స్పష్టమైన నిర్ణయం తీసుకుని విప్ జారీ చేసినప్పటికీ, ఒక రాజ్యసభ సభ్యుడు మాత్రం పార్టీ స్టాండ్‌కు విరుద్ధంగా ప్రభుత్వం వర్గాన్నే అనుసరించి ఓటు వేశారు. దీనిపై స్పందించిన లోకేశ్.. ఇది వైసీపీలో ఒక విపరీత వర్గం ఉన్నదనే సందేహాన్ని పెంచుతోందని తెలిపారు. ఈ పరిణామం అధికార వైసీపీ శిబిరంలో కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై ఇప్పటికే వైసీపీ హైకమాండ్ ఆరా తీస్తోందని సమాచారం. విప్ జారీ చేసినా పాటించని ఎంపీపై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లోకేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. పార్టీ నియమాలను ఉల్లంఘించేవారిని జగన్ క్షమించతారా? లేదా కఠిన చర్యలు తీసుకుంటారా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.