HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Poster Release On Jayaho Bc

Nara Lokesh : బీసీల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదలచేస్తాం – నారా లోకేష్‌

రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ నుంచి జయహో బీసీ పేరిట ఒక

  • Author : Prasad Date : 29-12-2023 - 1:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ నుంచి జయహో బీసీ పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. జయహో బీసీ కార్యక్రమ నిర్వహణపై తొలుత చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఒక వర్క్ షాపు ఏర్పాటు చేసుకుంటామని.. జనవరి 4వ తేదీనుంచి పార్లమెంటు, అసెంబ్లీ మండలస్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తామ‌ని లోకేష్ తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో ఒక భారీ సభ ఏర్పాటుచేసి బీసీ సోదరులకు మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించామ‌ని తెలిపారు. యువగళం పాదయాత్రలో బీసీ సోదరులు పడుతున్న ఇబ్బందులు తాను తెలుసుకున్నాన‌ని.. తాను తిరగని మండలాల్లో కూడా జయహో బీసీ ద్వారా సమస్యలు తెలుసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బీసీ సోదరులకు పుట్టినిల్లు టీడీపీ అని.. రాజకీయంగా ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో బీసీ సోదరులకు సీట్లు ఇచ్చి గెలిపించి కీలకశాఖలు ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. బీసీ అంటే బలహీనవర్గం కాదు, బలమైన వర్గమ‌ని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ 24శాతం రిజర్వేషన్ కల్పిస్తే, చంద్రబాబునాయుడు 34శాతానికి పెంచారన్నారు. గత ప్రభుత్వంలో బీసీల కోసం రూ.36వేల కోట్ల ఖర్చుచేశామ‌ని.. బీసీ కార్పొరేషన్ ద్వారా 3వేల కోట్లు, ఆదరణ ద్వారా వెయ్యికోట్లు వెచ్చించామ‌ని తెలిపారు. బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్, విదేశీవిద్య, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి ఎన్నో పథకాలు అమలుచేశామ‌ని.. చేనేత, మత్స్యకార, కల్లుగీత కార్మికులకు 50ఏళ్లకే పెన్షన్ ఇచ్చామ‌ని లోకేష్ తెలిపారు. శాసనసభలో తీర్మానం చేసి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరామ‌ని.. 2019లో టీడీపీ ఓడినా బీసీల కోసం సాధికార కమిటీలు ఏర్పాటు చేసి, వారి గళాన్ని విన్పించేందుకు వేదిక ఏర్పాటుచేశామ‌న్నారు.

Also Read:  100 Billion Dollars : తొలిసారిగా ఒక మహిళకు రూ.8 లక్షల కోట్ల సంపద.. ఎవరు ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BC
  • Jayaho BC
  • nara lokesh
  • tdp

Related News

Ap Legislative Council

మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

ఏపీ శానసమండలిలో(AP Legislative Council) వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడం, టేబుల్‌పై విసిరివేయడంపై ఎన్‌డీఏ మిత్రపక్షాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుడిని అవమానించడంపై మండిపడ్డారు. ఈ విషయంపై మండలి ఛైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మంత్రి నారా లోకేశ్‌తో పాటు కూటమి నేతలు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో దేవుడి చిత్రాలను ఎలా అనుమతించారని

  • Nara Lokesh Blackbuck

    Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

  • Vaali Lokesh

    Medaram Jathara Kova Bun Controversy : కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ భరోసా !!

Latest News

  • భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

  • డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

  • శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

  • నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

  • కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చ‌ద‌వాల్సిందే!

Trending News

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd