HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Is Going To Be Arrested In The Fibergrid Case

Nara Lokesh : లోకేశ్ అరెస్ట్ కు రంగం సిద్ధం అయిందా?

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత ఆయ‌న కుమారుడు లోకేష్

  • Author : Prasad Date : 18-09-2023 - 3:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Next Target Lokesh.... Cid Chief Signals!
Next Target Lokesh.... Cid Chief Signals!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత ఆయ‌న కుమారుడు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారంటూ వైసీపీ నేత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత లోకేష్ పాద‌యాత్ర‌ను నిలిపివేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో లోకేష్ ప‌ర్య‌టిస్తున్నారు. పార్టీ ఎంపీల‌తో క‌లిసి ఢిల్లీలోనే ఆయ‌న మ‌కాం వేశారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌పై జాతీయ మీడియాకు లోకేష్ ఇంట‌ర్వూలు ఇచ్చారు. లీగ‌ల్‌గా ఎలా ప్రోసీడ్ అవ్వాల‌నే దానిపై సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాదుల‌తో నారా లోకేష్ చ‌ర్చించారు. అయితే రేపు కానీ ఎల్లుండి కాని నారా లోకేష్ అరెస్ట్ అవ్వుతారంటూ జోరుగా ప్ర‌చారం సాగుతుంది.ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ ఈ రాత్రికి రాజ‌మండ్రి చేరుకోనున్నారు. రాజ‌మండ్రికి రాగానే ఎయిర్‌పోర్టులోనే లోకేష్‌కి నోట‌సులు ఇచ్చి అదుపులోకి తీసుకోనున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. లోకేష్‌ని ఫైబ‌ర్ గ్రిడ్ కేసులో అరెస్ట్ చేస్తార‌ని స‌మాచారం. మరోవైపు ఇప్పుడే తొందరపడి లోకేశ్ ను అరెస్ట్ చేయరంటూ మరో ప్రచారం జ‌రుగుతుంది. చంద్రబాబు అరెస్ట్ తో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్ర‌జా వ్య‌తిరేక‌త వెల్లువెత్తుతుంది. ఈ నేప‌థ్యంలో లోకేష్‌ని అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని మదింపు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ వర్గాలు సమాయత్తమయ్యే అవకాశం ఉంది. ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారికి న్యాయస్థానాల్లో బెయిల్ కూడా ల‌భించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Andhra Pradesh TDP
  • AP fiber
  • nara lokesh
  • tdp

Related News

Ap 10th Class Exams

ఆక్సిజన్‌ సిలిండర్‌తోనే.. పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి

ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకచోట ప్రాణాలతో పోరాడుతున్న విద్యార్థి పట్టుదల స్ఫూర్తి నింపగా, మరోచోట పరీక్షల విధుల్లో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రెండు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్‌తో పరీక్ష రాసిన విద్యార్థి ప్రక

  • Nagababu praises Lokesh response on the Mylavaram incident

    Naga Babu : మైలవరం ఘటనపై లోకేశ్ స్పందనకు నాగబాబు ప్రశంసలు

  • Physics Wala Vidyapeeth launched in Vijayawada

    Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..

  • Minister Lokesh

    విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • Kutami Govt

    అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

Latest News

  • Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!

  • Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

  • DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  • Gas Bill : మీరు హోటల్ కు వెళ్తున్నారా..? అయితే మీకు గ్యాస్ బిల్లు ఛార్జ్ పడినట్లే !!

  • KTR : పక్క ఆధారాలతో కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీతక్క

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd