HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Injured His Hand In Yuvagala

Nara Lokesh Injured : యువగళం పాద్రయాత్రలో నారా లోకేష్ కుడిచేతికి గాయం..

  • Author : Sudheer Date : 18-12-2023 - 11:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh Injured
Nara Lokesh Injured

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుడిచేతికి (Nara Lokesh Injured) స్వల్ప గాయమైంది. పాదయాత్రలో భాగంగా అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి లోకేష్ చేతిని అందుకొని బలంగా నొక్కడంతో వేలు (Injured His Hand) వాసింది. నరంపై ఒత్తిడి పడడంతో వాపు వచ్చినట్లు డాక్టర్స్ తెలిపారు. వాపు తగ్గేందుకు మెడిసిన్ ఇచ్చారు. వేలు నొప్పి ఉన్నప్పటికీ లోకేశ్ పాదయాత్రను యథావిధిగా కొనసాగించారు. నేటితో లోకేష్ యువగళం (Nara Lokesh Yuvagalam) పాదయాత్ర ముగుస్తుంది. విశాఖలోని శివాజీనగర్ లో యాత్ర పూర్తి అవుతుంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. ఇప్పటి వరకు 3,032 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. 70 బహిరంగసభల్లో లోకేశ్ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇచ్చి..తిరిగి ప్రారంభించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ నెల 20 భోగాపురం లో యువగళం ముగింపు సభ అట్టహాసంగా జరగబోతుంది. ఇప్పటికే ఈ సభ కు సంబదించిన పనులు పూర్తి కావొస్తున్నాయి. ఈ ముగింపు సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది కార్యకర్తలు , అభిమానులు హాజరుకాబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులు , ట్రైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకావాల్సి ఉంది..కానీ చివరి నిమిషంలో ఆయనకు వేరే కార్యక్రమాలు ఉండడంతో సభకు హాజరుకాలేకపోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. త్వరలో జరగబోయే టీడీపీ – జనసేన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరు అవుతానని తెలిపారు. ఇదిలా ఉంటె నిన్న రాత్రి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు..హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఉమ్మడి కార్యక్రమాల గురించి , అభ్యర్థుల ఎన్నికల , పొత్తులు తదితర అంశాల ఫై దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. మొదటిసారి చంద్రబాబు తన ఇంటికి రావడం పట్ల పవన్ సంతోషం వ్యక్తం చేసారు.

Read Also : Kerala To Dubai : కేరళ టు దుబాయ్ క్రూయిజ్ సర్వీసు.. విమానయానం కంటే చౌక!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lokesh padayatra
  • nara lokesh
  • Nara Lokesh Injured
  • yuvagalam

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd