HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh I Will Fulfill Every Promise Made During The Yuva Ghalam Padayatra

Nara Lokesh: పాదయాత్రలో చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తా: మంత్రి నారా లోకేష్

  • Author : Kode Mohan Sai Date : 07-10-2024 - 12:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

అమరావతి: యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేయడానికి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్పష్టం చేశారు. ఈ రోజు (సోమవారం) ఏపీ సచివాలయంలో మంత్రి లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, మారుమూల ప్రాంతాల్లో ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందిగా ఉన్నట్లు బ్రాహ్మణులు పాదయాత్ర సమయంలో తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం, ధూప, దీప నైవేద్యానికి సాయం రూ. 10 వేలకు పెంచినట్లు చెప్పారు. ఈ చర్య వల్ల రాష్ట్రంలోని 5400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా, అందరి క్షేమం కోరే మంచి ప్రభుత్వం తమదని నారా లోకేష్(Nara Lokesh) వెల్లడించారు.

ప్రజా చైతన్యాన్ని కేంద్రీకరించిన యువగళం:

యువగళం పాదయాత్ర ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యాన్ని లక్ష్యంగా ఉంచుకొని ముందుకు సాగింది. నారా లోకేశ్(Nara Lokesh) 226 రోజులు 3,132 కిలోమీటర్లు నడిచారు. 11 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 232 మండలాలు/మునిసిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా ఈ యాత్ర కొనసాగింది.

జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల లేక నిరాశ, నిస్పృహతో బాధపడుతున్న యువత ఒక వైపు, ఇంటి నుంచి బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి వస్తామనే గ్యారంటీ లేక భయంతో ఉన్న మహిళలు మరో వైపు, అడ్డగోలు ధరల కారణంగా జీవితం భారంగా మారిన జనసామాన్యం మరో వైపు, ఇలా ప్రతి కోణంలో అభద్రతాభావం మరియు నిరాశతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ధైర్యం ఇచ్చారు నారా లోకేశ్(Nara Lokesh).

మొత్తంగా, లోకేశ్ 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, ఎనిమిది రచ్చబండలు నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి 4,353 వినతిపత్రాలు అందుకున్నారు. వివిధ సామాజిక వర్గాలు, వృత్తి చేసేవారు నేరుగా లోకేశ్‌ను కలుసుకుని తమ కష్టాలను చెప్పుకున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నర మంది ప్రజలతో నారా లోకేశ్(Nara Lokesh) మమేకమయ్యారు.

లోకేశ్‌తో సెల్ఫీ(Selfie With Lokesh):

సెల్ఫీ చాలెంజ్‌ పేరిట టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి విజయగాథలు మరియు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రదర్శించడం ద్వారా టీడీపీ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. వినూత్న రీతిలో కేడర్‌కు మరియు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రారంభించిన ‘సెల్ఫీ విత్‌ లోకేశ్‌’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో 3.5 లక్షల మందికిపైగా అభిమానులతో లోకేశ్‌ సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. యువ నేతతో సెల్ఫీ దిగిన వారికి ఆ ఫొటోల్ని స్కానింగ్‌ చేసి, ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌లోడ్‌ చేశారు.

పాదయాత్రలో తనకు దృష్టి చెందిన సమస్యలను పరిష్కరించేందుకు, లోకేశ్‌ అధికార యంత్రాంగానికి 600కు పైగా లేఖలు రాశారు. పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయిన ప్రతిచోటా ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ, తమకు అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నారా లోకేశ్(Nara Lokesh) హామీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Minister Nara lokesh
  • nara lokesh
  • nara lokesh yuvagalam
  • Nara Lokesh Yuvagalam Padayatra
  • yuvagalam

Related News

Key update for AP Mega DSC candidates..when will the results be out..?

వచ్చే నెలలో డీఎస్సీ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ కసరత్తులు ?

రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు

    Latest News

    • బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?

    • అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?

    • మీ వెండి వ‌స్తువుల‌కు ఉన్న‌ నలుపును వదిలించుకోండి ఇలా?!

    • ట్రేడ్ డీల్ కుదరకపోవడానికి మోదీయే కారణం.. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ షాకింగ్ కామెంట్స్..

    • ప్ర‌భాస్ రాజాసాబ్‌.. పార్ట్‌-2 పేరు ఇదేనా?!

    Trending News

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

      • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

      • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd