Nara Lokesh Hot Comments: వైసీపీ పై నారా లోకేష్ సంచలన కామెంట్స్
- By Kode Mohan Sai Published Date - 11:12 AM, Mon - 21 October 24

“ఇంట్లో బాబాయ్‌ను చంపేసి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి! నీ పార్టీ పునాదులే నేరాలు—ఘోరాలని మీ కుటుంబ సభ్యులే చెప్పారు. నీ పాలనలో వేల మంది చనిపోయినా, ఒక్క మాట కూడా మాట్లాడని నువ్వు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావ్. ఐదేళ్ల పాటు గంజాయి, డ్రగ్స్ వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్. ఉన్మాదిని పెంచి, ప్రజల మీద వదిలావ్. నేరస్థులకు మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని లైసెన్స్ ఇచ్చావ్. నీ తమ్ముడు అవినాశ్‌రెడ్డి హత్య చేసినా కాపాడావ్. అనంతబాబులాంటి వారు దళితులను చంపితే ఇంటికి పిలిచి భోజనం పెట్టావ్. మహిళలను వేధించిన వారిని అందలం ఎక్కించావ్. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉన్న వారికి టికెట్లు ఇచ్చావ్. ఇంతటి నేరాలకు పాల్పడుతున్న నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే అర్హత ఉందా?” అని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో 2,027 మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారని, 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పారు. మరి కొంతమంది దారుణ ఘటనలను కూడా వివరించారు.
ఇంట్లో బాబాయ్‌ని చంపేసిన పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి.. నీ పార్టీ పునాదులే నేరాలు- ఘోరాలు అని మీ కుటుంబ సభ్యులే చెప్పారు. నీ పాలనలో వేల మంది చనిపోయినా, ఏ నాడు ఒక్క మాట, కనీసం ఒక్క సమీక్ష కూడా చేయని నువ్వు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావ్.. మా ఖర్మ.. 5 ఏళ్ళ పాటు గంజాయి,… https://t.co/drGQ0cMm7W
— Lokesh Nara (@naralokesh) October 20, 2024
“అబ్దుల్ సలాం కుటుంబ ఘటన కంటే ఘోరమైనది రాష్ట్రంలో మరోది ఉందా?” అని ప్రశ్నించారు. “జగన్ ఏనాడైనా ఒక్క బాధిత మహిళ వద్దకు వెళ్లి కనీసం పరామర్శించారా? ఒక్కసారైనా ఈ విషయాన్ని ఖండించారా?” అని నిలదీశారు.
నరసరావుపేటలో వక్ఫ్ ఆస్తులను కాపాడాలని కోరిన ఇబ్రహీంను నడిరోడ్డుపై చంపారని, మరొక ఉదాహరణగా పలమనేరులో మంచి చదువు చెప్పుతున్న మిస్బా అనే పదో తరగతి విద్యార్థినిని వేధించడంతో ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
“దిశ చట్టం అని లేని చట్టాన్ని ఉన్నట్లు ప్రకటించిన నువ్వు, ఆడబిడ్డలపై అత్యాచారం జరిగితే దిశ చట్టం ప్రకారం ఉరిశిక్ష వేస్తామని చెప్పినావు, కానీ ఒక్కరికైనా వేశావా? ఎందుకు ఈ అబద్ధపు జీవితం?” అని ధ్వజమెత్తారు.
“రాష్ట్రంలో జరిగే ప్రతి నేరానికి జగనే కారణమని, ఆయన పెంచి పోషించిన గంజాయి మాఫియానే అసలు కారణం” అని విమర్శించారు. “గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే ఉండాలనే విధంగా ఆయన పాలన సాగిందని” పేర్కొన్నారు.
“గత టీడీపీ హయాంలో 14,770 ఆటోమేటిక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు, జగన్ అధికారంలోకి రాగానే వాటిని మూలన పడేయలేదా?” అని ప్రశ్నించారు.
“కూటమి ప్రభుత్వం ఆయన నాటిన విషబీజాలను తొలగించడమే కాకుండా, సీమలో జగన్ కుటుంబం పోషించిన ఫ్యాక్షనిజాన్ని అణచివేసిన చరిత్ర చంద్రబాబుది అని” గుర్తు చేసారు. “సొంత పార్టీ నేతలను కూడా ఉపేక్షించకుండా అరెస్టు చేయించారని చెప్పుకొచ్చారు, జగన్ కుటుంబం మాత్రం రౌడీలను పెంచి పోషించిందని” అన్నారు.
“మత కలహాలు లేకుండా చేసినవారు చంద్రబాబు, తీవ్రవాదంపై పోరాడినవారు కూడా ఆయన. ఇప్పుడు ఐదేళ్లుగా నువ్వు పెంచి పోషించిన సైకోలను రాష్ట్రం నుంచి తరిమి, సైకో-ఫ్రీ రాష్ట్రంగా మార్చేది కూడా చంద్రబాబే” అని లోకేశ్ స్పష్టం చేశారు.