HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Firing Comments On Ycp

Nara Lokesh : మండలిలో లోకేష్ ఉగ్రరూపం..

Nara Lokesh : దళితులకు గుండు కొట్టించిన వాళ్ళు ఎవరు, డోర్ డెలివరీలు చేసింది ఎవరో అందరికీ తెలుసునంటూ నారా లోకేష్

  • Author : Sudheer Date : 25-02-2025 - 1:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Fire
Lokesh Fire

నారా లోకేష్ (Nara Lokesh) అసెంబ్లీ లో దూకుడు మరింత పెంచారు. ప్రత్యర్థుల విమర్శలకు , ఆరోపణలకు అంతే దీటుగా సమాధానం ఇస్తూ వారి నోరు మోయిస్తున్నారు. ఈరోజు మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మొదలు అయ్యింది. ఇందులో భాగంగా శాసనమండలిలో వైసీపీ సభ్యురాలు వరుదు కల్యాణి ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ (YCP) సభ్యులకు సమాధానం చెప్పేందుకు సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, సవితలతో కలిసి లోకేశ్ మండలికి వచ్చారు.

Samsung Tri Fold Phone: మూడు మడతలతో శాంసంగ్ ఫోన్.. ఫీచర్లు ఇవీ

ఈ సందర్భంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ… కేంద్రానికి తన మద్దతు ఉపసంహరిస్తే మోదీ సర్కారు ఏపికి ఏం చేయాలన్నా చేస్తుందని తెలిపారు. అంతటి మంచి అవకాశాన్ని కూటమి సర్కారు ఎందుకు వినియోగించుకోలేకపోతోందని కూడా ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా కల్యాణి వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పిన లోకేశ్… తాము ఎన్డీఏతో ఎన్నికలకు ముందే కలిశామని తెలిపారు. ఏపీకి అండగా నిలవాలన్న ఏకైన అజెండాతోనే అన్ కండీషనల్ మద్దతును బీజేపీకి ఇచ్చామని తెలిపారు.

AP Assembly : వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం

లోకేశ్ మాట్లాడుతుండగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనికి లోకేష్ వివరణ ఇస్తూ.. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పడంలేదన్నారు. పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, వాటితో పాటు అనుబంధ సంస్థలలో యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 22 ఎంపీ సీట్లను రాష్ట్ర ప్రజలు ఇస్తే ఏం చేశారని లోకేశ్ విపక్షాన్ని ప్రశ్నించారు. నాడు సరిపడినన్ని ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న మీ పార్టీ అధినేత జగన్… ఎన్నికల తర్వాత ఏం చేశారని ఆయన నిలదీశారు. దళితులకు గుండు కొట్టించిన వాళ్ళు ఎవరు, డోర్ డెలివరీలు చేసింది ఎవరో అందరికీ తెలుసునంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ వైసీపీ సభ్యులపై మండిపడ్డారు. దళితులపై దమనకాండ చేసి, వారి గురించి మీరా మాట్లాడేది? అంటూ నిప్పులు చెరిగారు. అనవసర రాద్ధాంతం చేయొద్దని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని వైసీపీ సభ్యులకు నారా లోకేష్ సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Legislative Council
  • nara lokesh
  • Nara Lokesh Firing
  • ycp

Related News

Ram Charan's shocking reaction to being compared with Nara Lokesh; comments at the Republic Summit go viral.

Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచిన ‘పెద్ది’ చిత్రం సాధించిన భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో, ఆయన ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ ‘రిపబ్లిక్ టీవీ’ నిర్వహించిన ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సం

    Latest News

    • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

    • Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

    • ACB Raids : ఎక్సైజ్ అధికారి ఇళ్ల‌పై ఏసీబీ దాడులు..

    • Fire Accident : లక్నో అగ్నిప్రమాద ఘ‌ట‌న‌లో నలుగురి అరెస్టు.. SIT విచారణకు సీఎం యోగి ఆదేశం

    • Nandamuri Balakrishna: మా అమ్మ బసవతారకం క్యాన్సర్‌తో పోరాడి చనిపోయారు. బసవతారకం హాస్పిటల్ వెనుక ఉన్న ఆ కన్నీటి కథ ఇదే.. ఎమోషనల్ అయిన బాలయ్య!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd