Vijayawada: మైనారిటీల ఆస్తులపై తప్ప, సంక్షేమంపై శ్రద్ధ ఏది జగన్!
యువగలం పాదయాత్రతో నారా లోకేష్ కు భారీ స్పందన లభిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల మద్దతు కూడగట్టడంలో లోకేష్ సక్సెస్ అవుతున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 20-08-2023 - 10:28 IST
Published By : Hashtagu Telugu Desk
Vijayawada: యువగలం పాదయాత్రతో నారా లోకేష్ కు భారీ స్పందన లభిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల మద్దతు కూడగట్టడంలో లోకేష్ సక్సెస్ అవుతున్నారు. ఇదే క్రమంలో సీఎం జగన్ వైఖరిని ఎండగడుతూ మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా సీఎం జగన్ ను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ.. మైనారిటీల ఆస్తులపై తప్ప సంక్షేమంపై శ్రద్ధ ఏదీ జగన్ అంటూ సూటిగా ప్రశ్నలు లేవనెత్తారు.విజయవాడంలో ఆయన పర్యటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
గత టిడిపి ప్రభుత్వ హయాంలో 1.33కోట్లతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని జన్నతుల్ భఖీ ఖబరస్థాన్ ను ఏర్పాటుచేశామని గుర్తు చేశారు లోకేష్. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్మశానవాటికల్లో సౌకర్యాలు కల్పించకపోగా వాటిని సైతం వదలకుండా వైసిపి దొంగలు కబ్జాపెడుతున్నారని ఆరోపించారు. గత నాలుగేళ్లలో వేలకోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తులు కబ్జాకు గురయ్యాయని వైసీపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ కు పాల్పడ్డారు లోకేష్. నర్సరావుపేటలో మసీదు ఆస్తుల పరిరక్షణకోసం పోరాడిన ఇబ్రహీంను నడిరోడ్డుపై నరికిచంపారు. జగన్ అండ్ కో కు మైనారిటీల ఆస్తులు మరియు ఓట్లపై తప్ప వారి సంక్షేమంపై శ్రద్ధలేదనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు లోకేష్.
Also Read: HCA- BCCI: బీసీసీఐకి లేఖ రాసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. ఆ మ్యాచ్ తేదీ మార్చాలని కోరిన HCA..!