Nara Lokesh Tweet : సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసులు పెట్టేలా ఉన్నారు : లోకేష్
Nara Lokesh Tweet : ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.
- By Pasha Published Date - 11:07 AM, Mon - 2 October 23

Nara Lokesh Tweet : ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ ఉదయం ఆయన ట్వీట్ చేశారు. ‘‘విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసా? పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తారా?’’ అని లోకేశ్ ఫైర్ అయ్యారు. ‘‘ఆ పోలీసుల తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూశారని, పసుపు రంగు దుస్తులు కట్టుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారు. రాజ ద్రోహం కేసు పెట్టి ఉరిశిక్ష వేసేయండి. జగన్ కు పిచ్చి పీక్స్ లో ఉన్నట్లు ఉంది. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే.. అమలు చేసినోడి బుర్రా బుద్ధీ ఏమయ్యింది?’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మంది పై కేసా? పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తారా? వీళ్ళ తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు గారి అరెస్ట్ వార్తలు చూసారని, పసుపు రంగు దుస్తులు కట్టుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారు. ఒక పని చేయండి రాజద్రోహం కేసు… pic.twitter.com/y9JatsgL8d
— Lokesh Nara (@naralokesh) October 2, 2023
Also read : Most Educated Countries: అత్యధిక విద్యావంతులైన దేశాల జాబితాలో ఇండియా, అగ్రస్థానంలో ఏ దేశం?
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నారా లోకేశ్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు. మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ కి నివాళులర్పించిన లోకేశ్ టీడీపీ ఎంపీలు, నేతలతో కలిసి ఎంపీ కనకమేడల నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని, అక్రమంగా అరెస్టు చేసిందని పేర్కొంటూ టీడీపీ ఆధ్వర్యంలో ఈ దీక్షలు చేపట్టారు. కాగా, గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనుమతి లేకపోయినా కంచాలు మోగిస్తూ, విజిల్స్ వేస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ 60 మందిపై గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు (Nara Lokesh Tweet) కేసులు నమోదు చేశారు.
సైకో జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు. రాజ్యాంగాన్ని కాలరాశారు. సత్యాన్ని వధించారు, ధర్మాన్ని చెరపట్టారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తోన్న అరాచకాలని నిరసిస్తూ మహాత్మా గాంధీ జయంతి…
— Lokesh Nara (@naralokesh) October 2, 2023