Nara Lokesh: బాలల భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత పాలకులకు ఉందా?-లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు.
- Author : Hashtag U
Date : 30-04-2022 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పదవ తరగతి పరీక్ష పత్రాల బాక్సులను మోస్తున్న చిన్నారుల చూస్తే ప్రభుత్వం ఇంకా మారదా అనిపించిందంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. బాలల భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత ఈ పాలకులకు ఉందా అని ప్రశ్నించారు.
పోలీసులకు, అధికారులకు బాలల హక్కుల గురించి అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థులు ప్రశ్నా పత్రాల బాక్సులను మోస్తున్న ఫోటోలను నారా లోకేశ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని సూచించారు.
దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లో పదవ తరగతి పరీక్ష పత్రాల బాక్సులను మోస్తున్న చిన్నారులను చూస్తే ఈ ప్రభుత్వం ఇంక మారదా అనిపించింది. బాలల భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత ఈ పాలకులకు ఉందా అసలు? పోలీసులకు, అధికారులకు బాలల హక్కుల గురించి అవగాహన లేకపోవడం బాధాకరం. pic.twitter.com/gF4wEgNPV8
— Lokesh Nara (@naralokesh) April 29, 2022